టెస్ట్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. లీడ్స్ వేదికగా యువ సారధి శుభమన్ గిల్ నాయకత్వంలో తొలిసారి భారత్ బరిలోకి దిగుతోంది. సీనియర్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సీరీస్ లో యువ ఆటగాళ్ళు కొందరు అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యారు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీగా నామకరణం చేసిన ఈ సీరీస్ లో.. ఇంగ్లాండ్ తరుపున సైతం యువ ఆటగాళ్ళు బరిలోకి దిగుతున్నారు.
Also Read : బ్లాక్ బాక్స్ కు ఏమైంది.. దర్యాప్తు కష్టమేనా..?
ఇక జట్టు కూర్పు విషయంలో ఎంతో ఆసక్తి నెలకొంది. తుది జట్టులో ఆడే ఆటగాళ్ళు ఎవరు అనే దానిపై సందిగ్దత నెలకొంది. ఇంగ్లాండ్ ముందుగానే జట్టును ప్రకటించినా.. భారత్ మాత్రం టాస్ సమయానికి తుది జట్టును ఖరారు చేసింది. భారత్ తరుపున.. తమిళనాడు యువ ఆటగాడు సాయి సుదర్శన్ అరంగేట్రం చేసాడు. ఐపిఎల్ సీజన్ తో పాటుగా ఇంగ్లాండ్ కౌంటీ సీజన్ లో నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్ కు ఇంగ్లాండ్ పర్యటనలో జట్టులో చోటు కల్పించారు సెలెక్టర్ లు. అయితే జట్టులో పెద్ద ఎత్తున పోటీ ఉండటంతో చోటు కష్టమే అని భావించారు.
Also Read : బిగ్గెస్ట్ సైబర్ అటాక్.. మెయిల్ పాస్వార్డ్ చేంజ్ చేసుకోండి
కాని సాయి సుదర్శన్ కు తుది జట్టులో చోటు కల్పించారు. అభిమన్యు ఈశ్వరన్ కు ఈసారి కూడా నిరాశ ఎదురు అయింది. ఇక సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ మరోసారి జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక బౌలింగ్ లో శార్దుల్ ఠాకూర్ సైతం రీ ఎంట్రీ ఇచ్చాడు. అర్శదీప్ సింగ్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయినా సరే బౌలింగ్ విభాగంలో అరంగేట్రం చేయలేకపోయాడు. ఇక పేస్ ఆల్ రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో.. శార్దుల్ ఠాకూర్ ను ఎంపిక చేసారు. దక్షిణాది నుంచి సాయి సుదర్శన్ అరంగేట్రం చేయడంతో క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, సిరాజ్ జట్టులో దక్షిణాది నుంచి ఆడుతున్నారు.