నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తోన్న అఖండ సీక్వెల్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా గురించి ఏ న్యూస్ వచ్చినా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అఖండ పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన టీజర్ కూడా అదిరిపోవడంతో.. రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో బాలయ్య తాండవం ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ బాలీవుడ్ కూడా ఎదురు చూస్తోంది.
Also Read : వరల్డ్ వైడ్ గా మిరాయ్ డామినేషన్.. సెంచరీ మార్క్ పక్కా..!
ఈ సినిమాలో క్లైమాక్స్ లో ఓ స్టార్ హీరో గెస్ట్ రోల్ కూడా ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తుండగా.. గోపి ఆచంట, రామ్ ఆచంట సినిమాను నిర్మిస్తున్నారు. దసరాకు సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే టైం లో మరో క్రేజీ న్యూస్ కూడా బయటకు వచ్చింది. సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొన్నట్టు సమాచారం. పలు సంస్థలు పోటీ పడగా.. నెట్ ఫ్లిక్స్ భారీగా ఖర్చు పెట్టేందుకు రెడీ అయింది.
Also Read : సజ్జల అవుట్.. సతీష్ రెడ్డి ఇన్.. జగన్ కీలక ఆదేశాలు
దాదాపు 90 కోట్ల రూపాయలకు హక్కులను దక్కించుకుందని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. జియో హాట్ స్టార్ కు, నెట్ ఫ్లిక్స్ కు మధ్య పోటీ జరగగా.. చివరకు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అఖండ ఫస్ట్ పార్ట్ ను హాట్ స్టార్ కొనుక్కున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల నుంచి దీనిపై రూమర్స్ వస్తున్నా ధర ఎంత అనేది క్లారిటీ రాలేదు. ఇప్పుడు మాత్రం 90 కోట్లకు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఇక రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది.