Saturday, April 4, 2026 10:00 AM
Saturday, April 4, 2026 10:00 AM

‘మేం ముగ్గురం’.. షాకిచ్చిన రష్మిక..!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు.. అది నిమిషాల్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అయిపోతుంది. తాజాగా రష్మిక షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఆమె షేర్ చేసిన ఓ చిన్న యానిమేషన్ వీడియో చూసి అభిమానులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. ముఖ్యంగా ‘మేము ముగ్గురం అయ్యాం’ అంటూ ఇచ్చిన క్యాప్షన్ చుట్టూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

Also Read : అంచనాలు పెంచిన ‘రామాయణ’ టీజర్ బడ్జెట్ వింటే షాక్..!

ఇటీవల హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న రష్మిక.. పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ యానిమేషన్ వీడియోలో రష్మిక, విజయ్ దేవరకొండ కార్టూన్ రూపంలో కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో ఒక చిన్న పొద్దుతిరుగుడు పువ్వు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ వీడియో చూసిన వెంటనే ఇది గుడ్ న్యూస్‌కు సిగ్నలా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం ప్రారంభించారు. రష్మిక ప్రెగ్నెంటా అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేయడంతో ఈ వార్త క్షణాల్లో వైరల్ అయ్యింది.

Also Read : బ్రేకింగ్; ఏపీ ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్..!

పెళ్లి ఫోటోలు ఇంకా కళ్లముందే కదులుతుండగా.. ఇంతలోనే ఈ తీపి కబురు ఏంటా అని అంతా ఆరా తీశారు. అయితే ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ పోస్ట్‌కు రష్మిక వ్యక్తిగత జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. రష్మిక చాలా కాలంగా ‘రూ’ అనే పొద్దుతిరుగుడు పువ్వు క్యారెక్టర్‌తో ఒక ప్రత్యేక యానిమేషన్ ప్రపంచాన్ని నిర్మిస్తోంది. తన వ్యక్తిత్వంలోని పాజిటివిటీని, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. ప్రెగ్నెన్సీ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ ప్రాజెక్ట్ వివరాలతో స్పష్టమైపోయింది. ప్రముఖ కంటెంట్ ప్లాట్‌ఫామ్ ‘టెర్రబిలీ టైనీ టైల్స్’ సహకారంతో ఈ యానిమేషన్ సిరీస్ రూపొందుతోంది.

‘రష్మిక & రూ’ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ఈ కథలకు నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇందులో రష్మిక, రూ మధ్య ఉన్న అనుబంధాన్ని క్యూట్ స్టోరీల రూపంలో చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ డిజిటల్ ఫ్యామిలీలోకి విజయ్ దేవరకొండను కూడా ఆహ్వానించారు. అంటే రష్మిక, రూ తో పాటు ఇప్పుడు విజయ్ కూడా ఆ యానిమేషన్ ప్రపంచంలో భాగమయ్యారు. దీంతో రష్మిక ఇచ్చిన క్యాప్షన్ కేవలం ఈ క్రియేటివ్ అనౌన్స్‌మెంట్ కోసమేనని అర్థమవుతోంది. వీడియోలో కనిపించిన గుడ్డు బొమ్మ, సన్ ఫ్లవర్ వంటి ఎలిమెంట్లు కేవలం యానిమేషన్ కథలో భాగం మాత్రమే. వీటిని వాస్తవ జీవితంతో లింక్ చేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఆ చిన్న క్లిప్ అభిమానుల్లో పెద్ద ఎత్తున డిస్కషన్లకు దారి తీసింది. సెలబ్రిటీలు చేసే చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఈ ఇన్సిడెంట్ మరోసారి నిరూపించింది. విజయ్, రష్మిక ఇద్దరూ రణబాలి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్; ఏపీ ప్రజలకు...

ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ...

అమరావతికి పట్టాభిషేకం.. పార్లమెంట్...

సాధారణంగా అధికార పార్టీలు ప్రవేశపెట్టే బిల్లులను...

బ్రేకింగ్; పేర్ని నానికి...

అధికారం కోల్పోయిన తర్వాత కూడా పోలీసులను...

బాబుకి తలనొప్పిగా మారుతున్న...

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల వ్యవహారశైలి టిడిపి...

బాబు మాస్టర్ స్ట్రోక్.....

అమరావతి అభివృద్ధి దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి...

అంచనాలు పెంచిన ‘రామాయణ’...

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం...

పోల్స్