Thursday, February 26, 2026 09:21 PM
Thursday, February 26, 2026 09:21 PM

కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. అసలు కొడవ వివాహం ఎలా చేస్తారు?

టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మిక మందన్న – విజయ్ దేవరకొండల వివాహం కొడవ సాంప్రదాయంలో జరుగుతోందనే వార్తల నేపధ్యంలో అసలు ఆ పెళ్లి ఎలా జరుగుతుందనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొడవ (కూర్గ్) సాంప్రదాయ పెళ్లిళ్లలో పూర్వీకుల ఆశీర్వాదాలు, ప్రకృతి పూజలపైనే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. పూజారులు లేకుండా, కుటుంబ పెద్దలు ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తారు. మూడు ముళ్ళు, ఏడు అడుగులు ఉండవు. అలాగే వధువు ఒడిలో బియ్యం స్థానంలో నాణేల మూట ఉంటుంది.

Also Read : పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్న డైరెక్టర్లు..!

దీనిని సంపద, శుభానికి చిహ్నంగా అక్కడి ప్రజలు భావిస్తారు. వధువు తల్లి పాత్ర పెళ్లిలో కీలకం. పెళ్లి కూతురు వారి సాంప్రదాయంలో తయారు చేసిన చీర, శాలువాను ధరిస్తుంది. పెళ్లి కొడుకు సాంప్రదాయ వస్త్రాలు ధరిస్తాడట. పెళ్లి మండపాన్ని వెదురు, మామిడి ఆకులతో అలంకరిస్తారు. దానికి పెద్దలు పూజలు చేసే విధానాన్ని అరువు అని పిలుస్తారు. భోజనంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బొప్పాయి ఆకులపై భోజనం చేస్తారు. భోజనంలో పంది మాంసంకు ప్రాధాన్యత ఉంటుంది. అన్నం, చికెన్, పాయసం ముఖ్యం.

Also Read : రష్మిక – విజయ్ పెళ్ళికి వెళ్ళిన టాలీవుడ్ స్టార్లు వీళ్ళే..!

అలాగే ఊరు కొడవు అనే సాంప్రదాయం ఉంటుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఊరు వెళ్లి, అక్కడ పెద్దల సమ్మతితో వివాహం చేస్తారు. వధువు తలపై నీళ్ళు పెట్టి, పూర్వీకుల ముందు మూడు మంటల మధ్య కూర్చుని సప్తపది చేస్తారు. దీనిని “సమ్మంద కొడుప” అని పిలుస్తారు. వధువు హక్కులను, వరుడు కుటుంబానికి ఇవ్వడానికి ఈ పద్ధతి ఫాలో అవుతారు. కొడవ సంప్రదాయ పెళ్లిలో కావేరి నదిని కులదేవతగా భావిస్తారు. కావేరి నది నీళ్ళు లేకుండా వివాహం జరగదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నా భర్తను పరిచయం...

విజయ్‌ దేవరకొండ, రష్మిక మూడు ముళ్ల...

పెద్దల సభ కు...

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ...

టార్గెట్ జనసేనాని అంటున్న...

ఏపీలో రెండు వరుస ఘటనలు ప్రభుత్వాన్ని...

తప్పు ఒకరిది.. కోర్టు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు...

మావో బాస్ కు...

మావోయిస్ట్ ల విషయంలో తెలంగాణా ప్రభుత్వం...

మళ్లీ వస్తే.. వాళ్లకు...

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.....

పోల్స్