Thursday, February 26, 2026 09:13 PM
Thursday, February 26, 2026 09:13 PM

నా భర్తను పరిచయం చేస్తున్నా: రష్మిక

విజయ్‌ దేవరకొండ, రష్మిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గురువారం ఉదయం 10.10కి రష్మిక మెడలో విజయ్‌ మూడు ముళ్లు వేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను రష్మిక అభిమానులతో పంచుకుంటూ ‘హాయ్‌ మై లవ్స్‌.. నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా మిస్టర్‌ విజయ్‌ దేవరకొండ ’ అని పేర్కొన్నారు. ‘‘హాయ్‌ మై లవ్స్‌.. నా భర్త మిస్టర్‌ విజయ్‌ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నా. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నేర్పిన వ్యక్తి .. ప్రశాంతంగా ఉండటం ఎలా ఉంటుందో నేర్పిన వ్యక్తి.. మన కలలు, లక్ష్యాలు పెద్దగా, గొప్పగా ఉండాలని రోజూ నాకు చెప్పే వ్యక్తి.. నేను అనుకున్నది సాధించగలనని నిత్యం ప్రోత్సహించే వ్యక్తి.. నేను ఇది చేయగలను అనుకున్నప్పుడల్లా ఇంతకన్నా ఎక్కువే సాధించగలవు అంటూ నాలోని శక్తి సామర్థ్యాలను నిరంతరం గుర్తు చేసే వ్యక్తి..

నా భావాలను నిరభ్యంతరంగా వ్యక్తపరిచినా ఎప్పుడూ అడ్డు చెప్పని వ్యక్తి.. స్నేహితులతో కలిసి ప్రయాణం చేయడం ఎంత గొప్పగా ఉంటుందో నేర్పిన వ్యక్తి. నన్ను నమ్మండి నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను. నేను ఒక మహిళ కలలు కంటూ ఉన్నా వాటిని సాకారం చేసి నువ్వు ఈ స్థాయిలో నిలబెట్టావు. నేను నిజంగా అదృష్టవంతురాలిని. విజ్జూ.. నీ పట్ల నాకున్న నాలోని భావాలను వ్యక్తం చేయడానికి మాటల సరిపోవు. ఈ విషయాన్ని నీకు పదే పదే చెబుతూ ఉంటాను. జీవితంలో అనుకోకుండా వచ్చే విజయాలు, కష్టాలు, సంతోషాలు, విచారాలు, ఆనందం, జీవితం అన్నీ నీకు తెలుసు.

ఇకపై ప్రతిదీ చాలా అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నేను నీతో ఉన్నాను. నువ్వు నా జీవితంలో అన్నింటిలో అతిపెద్ద భాగం. నేను నీ భార్యగా ఉండటానికి, కావడానికి, నీతో అలా పిలుపించుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ఇది పార్టీ చేసుకునే సమయం. పద మనం కలిసి అత్యుత్తమ జీవితాన్ని జీవిద్దాం. ఐ లవ్‌ వ్యూ’’ అంటూ రష్మిక ఇన్‌స్టా వేదికగా ఫొటోలను పంచుకున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా రష్మికపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. ఒక సాధారణ రోజున ఆమె లేని వెలితిని ఎంత గాఢంగా అనుభవించానో అంటూ హార్ట్ టచింగ్‌గా వివరించారు. తను పక్కన ఉంటేనే రోజంతా బాగుంటుందని, కలిసి భోజనం చేస్తేనే ఆ తృప్తి ఉంటుందని విజయ్ పేర్కొన్నారు.

వర్కవుట్స్ చేస్తున్నప్పుడు కూడా ఆమె తోడుంటే అది ఒక శిక్షలా కాకుండా సరదాగా అనిపిస్తుందని తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఎక్కడ ఉన్నా సరే, ఆమె పక్కన ఉంటేనే తనకు ప్రశాంతత, ఒక సొంత ఇంటి అనుభూతి కలుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. చివరికి తన ప్రాణ స్నేహితురాలినే తన జీవిత భాగస్వామిగా చేసుకున్నట్లు విజయ్ అధికారికంగా ప్రకటించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పెద్దల సభ కు...

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ...

టార్గెట్ జనసేనాని అంటున్న...

ఏపీలో రెండు వరుస ఘటనలు ప్రభుత్వాన్ని...

తప్పు ఒకరిది.. కోర్టు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు...

మావో బాస్ కు...

మావోయిస్ట్ ల విషయంలో తెలంగాణా ప్రభుత్వం...

మళ్లీ వస్తే.. వాళ్లకు...

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.....

మేడం గారు రెబల్.....

సాధారణంగా మహిళలు అనగానే రాత్రి సమయాల్లో...

పోల్స్