సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమాలు రెండు సూపర్ హిట్ అయితే ఒక సినిమా షాక్ ఇచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బాల్తాపడటంతో నిర్మాతలకు భారీగా నష్టాలు మిగిలాయనే చెప్పాలి. కథ పై నమ్మకంతో నిర్మాత దిల్ రాజు ఈ సినిమా కోసం భారీగానే పెట్టుబడి పెట్టారు. కానీ అనుకున్న విధంగా లాభాలు రాకపోవడంతో షాక్ అయ్యారు. సంక్రాంతి కానుకగా రెండు సినిమాలను రిలీజ్ చేసిన ఆయన ఒక సినిమా డిజాస్టర్ కావడంతో ఆ నష్టాలను ఎలా భర్తీ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు.
Also Read : ఎన్టీఆర్ ‘పెద్ది’ కథ లాక్కున్న రామ్ చరణ్…?
రామ్ చరణ్ పై అలాగే శంకర్ పై నమ్మకంతో ఈ సినిమాపై భారీగా పెట్టుబడి పెట్టిన దిల్ రాజుకు దాదాపు 150 నుంచి 200 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంలో రామ్ చరణ్ దిల్ రాజుకు సహకరించడానికి రెడీ అయిపోయాడు. తన రెమ్యూనరేషన్ లో దాదాపు 40 శాతం తిరిగి ఇవ్వటానికి రెడీగా ఉన్నట్లు దిల్ రాజుకు చెప్పాడట రామ్ చరణ్. అటు డైరెక్టర్ శంకర్ కూడా తన రెమ్యూనరేషన్ లో కొంత తిరిగిచ్చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
Also Read : రామ్‌చరణ్ కెరీర్‌ను నాశనం చేసిన శంకర్
అలాగే దిల్ రాజు బ్యానర్లో మరో సినిమా చేయాలని కూడా రామ్ చరణ్ డిసైడ్ అయ్యాడు. పదేళ్ల క్రితం దిల్ రాజు నిర్మాతగా ఎవడు అనే సినిమాలో రామ్ చరణ్ నటించాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ దాదాపు నాలుగేళ్లు జరగటంతో బడ్జెట్ కూడా అనుకున్న దానికంటే భారీగా పెరిగిపోయింది. దానికి తోడు వసూళ్లు కూడా అనుకున్న విధంగా లేకపోవడంతో రామ్ చరణ్ తన వంతు సహాయం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక దిల్ రాజు నిర్మాతగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది.