ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి రాజ్యసభ స్థానానికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనితో రాజ్యసభ స్థానం ఎవరికి కేటాయిస్తారు అనేదానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కొంత మంది పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు చర్చల్లో ఉంది. ఆయన ఇటీవల ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల విషయంలో కూడా ఆసక్తి చూపించారు.
Also Read : తులసి బాబు బయటపెట్టిన వ్యక్తి ఎవరు…??
అయితే కొన్ని కీలక కారణాలతో ఒక స్థానాన్ని బిజెపికి కేటాయించడం మరో రెండు స్థానాలను ముందుగా హామీ ఇచ్చిన వాళ్లకు ఇవ్వటంతో గల్లా జయదేవ్ సైలెంట్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి స్థానం కాళీ కావడంతో గల్లా జయదేవ్ ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. పార్లమెంట్ లో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న గల్లా జయదేవ్ రాష్ట్రం తరఫున బలంగా పనిచేస్తారని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అయితే ఆయన విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంత సానుకూలంగా లేరు అనే ప్రచారం కూడా జరుగుతుంది.
Also Read : ఏబీ వెంకటేశ్వరరావు కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త
2018 చివర్లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో గల్లా జయదేవ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయన విషయంలో బిజెపి అగ్ర నాయకత్వం అంత సానుకూలంగా లేదనే ప్రచారం జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎలాగైనా సరే గల్లా జయదేవ్ ను రాజ్యసభకు పంపించాలని పట్టుదలగా ఉన్నారు. ఆర్థికంగా కూడా బలమైన నేత కావడం.. ఉన్నత విద్యావంతుడు కావడంతో ఆయనకు రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తే కచ్చితంగా అది పార్టీకి కూడా బలం అవుతుందని చంద్రబాబు యోచిస్తున్నారు. అయితే ఈ స్థానం విషయంలో బిజెపి గానీ జనసేన గానీ జోక్యం చేసుకునే అవకాశం లేకపోవడంతో చంద్రబాబు నాయుడు.. గల్లా జయదేవ్ ను దాదాపుగా ఫైనల్ చేసే అవకాశం ఉండొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.




