Saturday, September 13, 2025 09:49 AM
Saturday, September 13, 2025 09:49 AM
roots

కూలీ డామినేషన్.. మరీ ఈ రేంజ్ లోనా..?

రెండు భారీ సినిమాలు పోటీలో ఉన్నాయి అంటే విజేత ఎవరూ అనే దానిపై ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో రెండు సినిమాలు రిలీజ్ అయితే, ఈ రెండు సినిమాలపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఒకటి సూపర్ స్టార్ రజనీ కాంత్ కూలీ సినిమా కాగా రెండు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన వార్ 2. భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు.. సౌత్ లో ఎక్కువ డామినేట్ చేసాయి. అయితే వసూళ్ళ పరంగా చూస్తే.. కూలీ డామినేషన్ ఓ రేంజ్ లో కనపడింది.

Also Read : లోకేష్ రివేంజ్ అదుర్స్, వైసీపీ జర్నలిస్ట్ ప్రశంసలు

వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ హిందీలో రూ. 29 కోట్లు, తెలుగులో రూ. 23.25 కోట్లు, తమిళ వెర్షన్ రూ. 25 లక్షలు వసూలు చేసింది.ఆక్యుపెన్సీ విషయానికొస్తే, వార్ 2 చాలా తక్కువ అనే చెప్పాలి. మార్నింగ్ షోలలో 16.37% ఆక్యుపెన్సీని, మధ్యాహ్నం షోలలో 23.67% ఆక్యుపెన్సీని, సాయంత్రం షోలలో 29% ఆక్యుపెన్సీని, రాత్రి షోలలో 47.90% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ నటించిన ‘కూలీ’ సినిమా డిఫరెంట్ టాక్ తో బంపర్ ఓపెనింగ్‌స్ సాధించింది.

Also Read : జగన్‌కు షాక్ ఇచ్చిన ఆప్తులు..!

జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఈ సినిమా మొదటి రోజు.. రూ. 65 కోట్ల వరకు వసూలు చేసింది. ఆక్యుపెన్సీ విషయానికి వస్తే, కూలీ ఉదయం షోలలో 81.95% ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం షోలలో 85.13% ఆక్యుపెన్సీ, సాయంత్రం షోలలో 86.57% ఆక్యుపెన్సీ, రాత్రి షోలలో 94.32% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇప్పటి వరకు ఓ తమిళ సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం ఇదే మొదటిసారి. ఇక బాలీవుడ్ లో ఎక్కువ ఓపెనింగ్స్ సాధించిన రెండవ సినిమాగా వార్ 2 నిలిచింది. విక్కీ కౌశల్ నటించిన చావా (రూ. 31 కోట్లు)ను అధిగమించి రెండవ స్థానంలో నిలిచింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్