Wednesday, February 4, 2026 04:03 PM
Wednesday, February 4, 2026 04:03 PM

రఘురామపై పీవీ సునీల్ సంచలన ట్వీట్..!

ఏపీ డిప్యూటి స్పీకర్ రఘు రామ కృష్ణం రాజుపై రుణాల వ్యవహారం సంచలనం అవుతోంది. తాజాగా సుప్రీం కోర్ట్ సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో ఏ విధమైన పరిణామాలు ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి ఇండ్‌ బరాత్ థర్మల్ పవర్ లిమిటెడ్ సుమారు 826.17 కోట్లు రుణం తీసుకోగా ఆ నిధులను రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చారు అనే ఆరోపణలు ఉన్నాయి. అప్పు చెల్లించకుండా డైవర్షన్ చేసారనే విమర్శలు వచ్చాయి.

Also Read : బ్రేకింగ్: టీడీపీలో పదవుల పండుగ

ఇంకో కేసులో ఇండ్‌ బరాత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్ సుమారు 947.71 కోట్లు రుణం తీసుకుని వాటిని కూడా సక్రమంగా వినియోగించలేదు అనే విమర్శలు వచ్చాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్ట్.. సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తరుణంలో.. రఘురామను కస్టడీలో టార్చర్ చేసిన ఐపిఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఓ ట్వీట్ చేసారు. ఈ కేసులో ఆయనను విచారించేందుకు.. ఏపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన నేపధ్యంలో సునీల్ కుమార్ ఆసక్తికర కామెంట్ చేసారు.

Also Read : ఐపీఎల్ మినీ వేలం.. అతనిపై కోట్ల వర్షం..?

దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు.. మంచిదే, మరి సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవుల నుండి సస్పెండ్ చేయాలి కదా..? అని ప్రశ్నించారు. సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుండి తొలగించాలి అని డిమాండ్ చేసారు. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా ఛానల్ లో వచ్చిన వీడియోని పోస్ట్ చేస్తూ కామెంట్ చేసారు. మరి దీనిపై రఘురామ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్