Saturday, October 25, 2025 07:59 PM
Saturday, October 25, 2025 07:59 PM
roots

భారీ బడ్జెట్ కో దండం.. హీరోల పరువు పోతుందా..?

భారీ బడ్జెట్ సినిమాలు.. ఇప్పుడు గట్టిగా నడుస్తోన్న ట్రెండ్. అగ్ర హీరోలు అనే కారణంతో భారీ ఫ్యాన్ బేస్ ఉందనే నమ్మకంతో వందల కోట్లు పెట్టుబడులు పెట్టి సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. దర్శకుడి దగ్గర దమ్ము ఉంది అనుకుంటే సినిమాకు భారీ పెట్టుబడి పెట్టేస్తున్నారు. ఇక వసూళ్ళ పేరుతో పోస్టర్ లు రిలీజ్ చేసి సోషల్ మీడియాను ఊపెస్తున్నారు నిర్మాతలు. మరి నిజంగా సినిమాలకు లాభాలు వస్తున్నాయా..? అంటే చెప్పలేని పరిస్థితి. వందల కోట్లు పెట్టుబడి పెట్టి వాటికి వడ్డీలు కట్టి.. నిర్మాతలు నలిగిపోతున్నారనే విషయం అర్ధమవుతోంది.

Also Read : వార్ 2 వరల్డ్ వైడ్ లెక్క ఇదే.. మరీ ఇంత దారుణమా..?

తాము పెంచి పోషించిన భారీ బడ్జెట్ పాము తమనే కాటు వేస్తోంది. ఈ మధ్య కాలంలో ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. పుష్ప 2 సినిమా భారీ బడ్జెట్ తో వచ్చింది. వందల కోట్ల కలెక్షన్ లు వచ్చాయని చెప్పారు. కానీ బయ్యర్లు మాత్రం నిండా మునిగారు అనే ఓ వార్త బయటకు వచ్చింది. నిర్మాత మాత్రమే ఇక్కడ బాగుపడ్డాడు అనేది విమర్శ. ఇక గేమ్ చెంజర్ సినిమా.. ఈ సినిమా భారీ పెట్టుబడితో వచ్చింది. కానీ నిర్మాతను నిండా ముంచింది. ఏ అంచనాలు లేకుండా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అదే నిర్మాతను కాపాడింది.

ఇక తమిళంలో సూర్య హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుని నిర్మాతను ముంచింది. ఇక దిల్ రాజు నిర్మాతగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా.. GOAT సినిమా రాగా.. ఆ సినిమా కూడా నిర్మాతను నిండా ముంచింది అనే చెప్పాలి. కనీసం పెట్టుబడి వచ్చినట్టు ఎక్కడా వార్తలు రాలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి కూడా అంతే. అలాగే మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప సినిమా కనీసం 100 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది.

Also Read : మారన్ ను ముంచిన కూలీ.. లాభాలు కష్టమేనా..?

ఇటీవల వార్ 2, కూలీ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో వచ్చాయి. ఈ సినిమాలు కనీసం 300 కోట్ల మార్క్ దాటలేదు. పెట్టుబడి మాత్రం భారీగా పెట్టారు. ఇలా ఎన్నో సినిమాలు భారీ బడ్జెట్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చి.. ఫ్యాన్స్ పరువు తీసి నిర్మాతను ముంచేస్తున్నాయి. దీనితో భారీ బడ్జెట్ సినిమాలు అనే మాట ఎత్తాలి అంటే భయపడుతున్నారు హీరోలు. హీరోల పరువు కూడా పోతోంది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఎన్నో సినిమాలు ఇతర భాషల్లో హిట్ అవుతున్నాయి. మన హీరోలు మాత్రం భారీ బడ్జెట్ అంటూ టైం వృధా చేస్తుండటం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్