Thursday, March 12, 2026 09:28 PM
Thursday, March 12, 2026 09:28 PM

బాలీవుడ్ ఓ చెత్త అంటూ స్టార్ హీరోయిన్ కామెంట్స్

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగి గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన స్టార్ హీరోయిన్.. ప్రియాంకా చోప్రా. బాలీవుడ్ ను వదిలేయడం అప్పట్లో ఓ సంచలనం. అయితే తాను హిందీ చిత్ర పరిశ్రమను వదిలి వెళ్లడానికి గల కారణాలను రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్‌కు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో ఆసక్తికర కామెంట్స్ చేసింది. దశాబ్ద కాలంగా హాలీవుడ్‌ లో స్థిరపడిన ప్రియాంకా చోప్రా, తాను బాలీవుడ్ వదలడం వెనుక రాజకీయాలే కారణం అంటూ బయటపెట్టింది.

Also Read : ఏపీ క్యాబినెట్‌లో మార్పులు.. ఈసారి వారికే ఛాన్స్..!

బాలీవుడ్‌లో తనను ఒక మూలకు నెట్టేశారని ఆమె వాపోయింది. అక్కడ నడుస్తున్న రాజకీయాలతో తాను విసిగిపోయానని సంచలన కామెంట్స్ చేసింది. కొందరు వ్యక్తులు కావాలనే తనను సినిమాల్లోకి తీసుకోకుండా అడ్డుకున్నారని, దీనివల్ల అవకాశాలు తగ్గిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పరిశ్రమలో ఉండే గ్రూపులలో చేరడం, వారిని ప్రసన్నం చేసుకోవడం వంటి పనులు చేయడం తనకు ఇష్టం లేదని ప్రియాంక స్పష్టం చేసింది. ఒకే రకమైన పాత్రలతో తన టాలెంట్ ను అడ్డుకుంటున్నారు అనే భావన కలిగిందని, అందుకే కొత్త ఛాన్స్ ల కోసం ప్రయత్నం చేసినట్లు తెలిపింది.

Also Read : రేవంత్ కాదు.. అమిత్ షానే..? ఢిల్లీలో మావో అగ్రనేత..!

అదే సమయంలో అమెరికాలో మంచి ఛాన్స్ రావడంతో, అది తనకు బాలీవుడ్ నుంచి బయటపడటానికి ఒక మంచి మార్గంగా కనపడిందని ప్రియాంక వెల్లడించింది. తాను చెత్తలో ఉండటానికి ఇష్టపడనని క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే ఆ వాసన అలవాటైపోతుంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె హాలీవుడ్‌లో బిజీగా ఉండటమే కాకుండా, త్వరలో ఎస్.ఎస్. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ చిత్రంతో మళ్ళీ ఇండియన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏఐఎస్ అంటే ఏంటీ..?...

ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య...

ముహుర్తం ఖరారు.. మార్చి...

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం రూపురేఖలు మారబోతున్నాయి....

ఏపీ మంత్రుల ప్రోగ్రెస్...

ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల పని తీరును...

బ్రేకింగ్: భారత నౌకలకు...

ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య...

లోకేష్ సీఎం.. ముహూర్తం...

​బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్...

బ్రేకింగ్: పాదయాత్రకు సిద్దమవుతోన్న...

తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని తిరిగి...

పోల్స్