Friday, October 24, 2025 11:50 PM
Friday, October 24, 2025 11:50 PM
roots

ప్రభాస్ పైనే ఆశలన్నీ.. నిర్మాతలను కాపడతాడా..?

భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ ఈ మధ్య కాలంలో నిర్మాతలకు షాక్ ఇస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వస్తున్న సినిమాలతో ఇటు బయ్యర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. స్టార్ హీరోల ఇమేజ్ కూడా బయ్యర్లను కాపడలేకపోతోంది. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా హిట్ టాక్ వచ్చినా సరే నైజాంలో నిర్మాతలు భారీగా నష్టపోయినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పుష్ప సినిమా కూడా బయ్యర్లకు నష్టాలు మిగిల్చాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలు కూడా నిర్మాతలను ఇబ్బంది పెట్టాయి.

Also read : మేడం గురించే చర్చ..!

కాని ఒక్క ప్రభాస్ విషయంలో మాత్రం ఇది రివర్స్ లో ఉంది. సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా నిర్మాతలకు లాభాల వర్షం కురుస్తోంది. గత ఏడాది వచ్చిన కల్కీ సినిమా నిర్మాతలకు, బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కర్ణాటక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ప్రభాస్ తో భారీ ఒప్పందం చేసుకుంది. దాదాపు ఆరు సినిమాలు ప్రభాస్ లైన్ లో పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది ఇందులో రెండు సినిమాలు రిలీజ్ కావడం ఖాయంగా కనపడుతోంది.

Also read : మేడం గురించే చర్చ..!

ఇదే సమయంలో నిర్మాతలతో పాటు బయ్యర్లు కూడా ప్రభాస్ సినిమాలపై ఖర్చు పెట్టేందుకు సిద్దమైపోతున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో పాటుగా హనూ రాఘవపూడి సినిమా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో.. స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాల్లో రాజాసాబ్ దాదాపుగా కంప్లీట్ అయిపొయింది. ఈ సినిమాకు ఇప్పటి నుంచే భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవల పెద్ద సినిమాలతో నష్టపోయిన బయ్యర్లు ఎలాగైనా ఈ సినిమా కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. సీడెడ్, నైజాంలో ప్రముఖ థియేటర్ ఓనర్లు సైతం ఇప్పుడు ప్రభాస్ సినిమాలపై తమ వంతుగా ఖర్చు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్టు సినీ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న...

భారత వాతావరణ శాఖ (IMD) తాజా...

దారితప్పిన వారిపై వేటు...

https://www.youtube.com/watch?v=O6ejiO-k3W8

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

పోల్స్