Saturday, September 13, 2025 06:46 AM
Saturday, September 13, 2025 06:46 AM
roots

రెబల్ ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ రెడీ చేసిన తమిళ డైరెక్టర్

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమా అంటే క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్… హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఏకంగా మూడు సినిమాలు చేయనున్నాడు. ఇప్పటికే వీటికి అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఇందుకోసం 550 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఇవ్వటానికి హోంబలే ఫిలిమ్స్ రెడీ అయింది. ఇక వీరి కాంబినేషన్లో… ఉన్న క్రేజీ సినిమా తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు ఎన్నో గాసిప్స్ వచ్చాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ సినిమా కూడా ఉండబోతుంది అనే టాక్ కూడా ఉంది.

Also Read : ఎన్టీఆర్ – నీల్ స్టార్ట్ అవుతుంది.. మొదటి షెడ్యూల్ అక్కడే..!

ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎప్పటినుంచో ఫాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అనౌన్స్మెంట్ అఫీషియల్ గా రాకపోయినా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది అనే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక లేటెస్ట్ గా మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రభాస్ రీసెంట్ గా ఒక కొత్త లుక్ లో కనిపించాడు. వింటేజ్ లుక్స్ లో ప్రభాస్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో యమాగా వైరల్ అయింది. ఇక లోకేష్ కనగరాజ్ మూవీ అంటే ఒక వీడియో రిలీజ్ చేస్తాడనే క్లారిటీ అందరికీ ఉంటుంది.

Also Read : రేవంత్ పేరు కావాలనే మర్చిపోతున్నారా…?

విక్రమ్ అలాగే కూలి సినిమాలకు కమల్ హాసన్, రజనీ కాంత్ లుక్స్ ని రివ్యూ చేసే వీడియోలు కూడా వదిలాడు. ఇప్పుడు అలాంటి ప్లానింగ్ తోనే ప్రభాస్ కి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సినిమా మొదలు పెడితే ఆరు నెలల్లో కంప్లీట్ చేసి రిలీజ్ చేసేస్తాడు లోకేష్. దీనితో ప్రభాస్ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు అనే టాక్ కూడా వినపడుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ అనే సినిమాపై ఫోకస్ చేసాడు. ఈ సినిమా షూట్ ను మార్చ్ మిడ్ లోపు కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్