Friday, September 12, 2025 07:20 PM
Friday, September 12, 2025 07:20 PM
roots

రాజకీయ శరణార్థిగా గుర్తించండి.. ప్రభాకర్ రావు సంచలన ట్విస్ట్

తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ రేంజ్ లో దుమారం రేపిందో అందరికి తెలిసిందే. అప్పట్లో సినిమా నటులు ప్రతిపక్షాల నాయకులు… చివరికి అధికార పార్టీ నాయకుల ఫోన్ లు కూడా అప్పట్లో ట్యాప్ చేసారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీనిపై సిఎం రేవంత్ రెడ్డి అప్పట్లో ఘాటు వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆయన చేసిన విమర్శల్లో పోలీస్ అధికారి ప్రభాకర్ రావును ఎక్కువగా టార్గెట్ చేసారు. ఇక ఆ తర్వాత ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారు. కేసు నమోదు అయిన వెంటనే అమెరికాలో తల దాచుకున్నారు.

Also Read : అడ్డంగా దొరికిన వెంకటరామిరెడ్డి.. ఇంకా మర్యాదలు చేస్తారా?

అలాగే శ్రవణ్ రావు కూడా అమెరికాలోనే ఉన్నారు. ప్రస్తుతం కింది స్థాయి అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థి గా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేసారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ పిటిషన్ లో ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో తాను పనిచేశానని, రాజకీయంగా తనను ప్రభుత్వం వేధిస్తుందని పిటిషన్ లో ఆవేదన వ్యక్తం చేసారు.

Also Read : గనుల వెంకటరెడ్డికి జైల్లో స్పెషల్ టీవీ, రిఫ్రిజిరేటర్?

తాను అనారోగ్య సమస్యలతో తాను కొట్టుమిట్టాడుతున్నానని పేర్కొన్న ప్రభాకర్ రావు… ప్రస్తుతానికి ఫ్లోరిడాలో తన కుమారుని వద్ద ఉంటున్నానని అందులో వివరించారు. మరోవైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావు ని ఇండియాకు రప్పించేందుకు అన్ని విధాలుగా తెలంగాణా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు పోలీసుల ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ప్రస్తుతానికి చికాగోలో శ్రవణ్ రావు అడ్రస్ ను కూడా కనుగొన్న పోలీసులు ఆయనను కూడా ఇండియా తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్