వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో కాకినాడ పోర్ట్ లో అక్రమ రేషన్ బియ్యం దందాపై అప్పటి విపక్షాలు జనసేన, టీడీపీ తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తూ వచ్చాయి. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పెద్ద ఎత్తున ఈ అక్రమ బియ్యం దందాకు పాల్పడ్డారు అనే ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ పోర్ట్ నుంచి ఆఫ్రికా దేశాలకు ఈ అక్రమ బియ్యం పెద్ద ఎత్తున రవాణా అవుతూ వచ్చింది. అధికారం మారిన తర్వాత కూడా ఈ అక్రమ రేషన్ బియ్యం దందా ఆగలేదు. గురువారం ఏకంగా 38 వేల టన్నుల బియ్యం షిప్ లో లోడ్ చేసారు.
దీనిని స్వయంగా కలెక్టర్ పట్టుకున్నారు. రసాయనాలు తీసుకు వెళ్లి అది అక్రమ బియ్యం అని గుర్తించారు. ఇక నేడు కాకినాడ పర్యటనకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. అక్రమ రేషన్ దందాను… అధికారులే ప్రోత్సహిస్తున్నారు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది అధికారులు.. ఇన్ని చెక్ పోస్ట్ లు ఉండగా రేషన్ బియ్యం పోర్టు లోపలికి ఎలా వచ్చాయో అని అధికారులను పవన్ లైవ్ లోనే నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ స్వయంగా అక్కడే నిలదీశారు.
Also Read : గనుల వెంకటరెడ్డికి జైల్లో స్పెషల్ టీవీ, రిఫ్రిజిరేటర్?
ఈ సందర్భంగా పలువురు అధికారుల పేర్లను పవన్ నోట్ చేసుకున్నారు. ఆ అధికారులను సస్పెండ్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. పోర్ట్ ఆఫీసర్ ధర్మ శస్త్ర, డీఎస్పీ రఘు వీర్, సివిల్ సప్లై డీఎస్ఓ ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటాలు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న సరే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని… హు ఇజ్ అగర్వాల్ అంటూ నిలదీశారు. డిపార్ట్మెంట్ లు ఫెయిల్ అవుతున్నాయని పవన్ మండిపడ్డారు. పోర్ట్ కి రేషన్ రైస్ వస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి చేస్తుందని పోలీసులను ప్రశ్నించారు.
ఇక పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్ళు నమిలారు. స్వయంగా మంత్రి వచ్చి చెప్పినా సీరియస్ నెస్ లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు పై చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకి చురకలు అంటించారు పవన్… మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ నిలదీశారు. మనం పోరాటం చేసింది దీని కోసమేనా అని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా పవన్ వినలేదు. మీరు సరిగా ఉంటే పోర్ట్ లోకి రైస్ ఎలా వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. చేసిన పోరాటాలు వృధా కదా అంటూ పవన్ మండిపడ్డారు.
Also Read : చంద్రబాబు వద్దకు చేరిన బూడిద పంచాయితీ
కాగా కాకినాడ పోర్ట్ వద్ద సముద్రంలో ప్రయాణించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేషన్ బియ్యం పట్టుబడ్డ నౌక వద్దకు ప్రత్యేక బోట్‌లో వెళ్ళారు. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరా తీసారు. సముద్రంలో 9 నాటికల్ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించారు. భారీగా బియ్యం అక్రమ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై పడవలోనే పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.