ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి యోగి ఆదిత్య నాథ్ బాధ్యతలు చేపట్టిన సమయంలో.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అన్నిటికంటే ఒక విషయంలో సర్కార్ దూకుడు ప్రదర్శించింది. పాన్ పరాగ్ ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంది. గవర్నమెంట్ ఆఫీసులు, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ కార్యాలయాలు సహా పబ్లిక్ ఉండే ప్రదేశాల్లో పాన్ పరాగ్ తిని ఉమ్ము వేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవడం చూసాం. ఆ తర్వాత ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాలు ఆ విషయంలో కఠినంగా వ్యవహరించే ప్రయత్నం చేసాయి.
Also Read : అసలు సునామీ అంటే ఏంటీ..? సునామీలకు కారణాలు ఏంటీ..?
ఇప్పుడు ఈ సమస్య దేశం దాటడం ఆశ్చర్యం కలిగిస్తోంది. యూకేలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉందని అక్కడి అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ వాసులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లను చూసి షాక్ అవుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డస్ట్ బిన్ లు ఉండే ప్రదేశాల్లో.. చాలా వరకు రోడ్ల మీద ఎర్రగా కనపడుతోంది. భారతీయులే ఎక్కువగా వాటిని తింటూ ఉంటారు. దీనితో అక్కడి అధికారులు.. దీనిపై నిఘా పెట్టినట్టు సమాచారం.
Also Read : ఆయనకు ఎందుకు కోపం వచ్చిందంటే..?
2019 లో, లీసెస్టర్ సిటీ పోలీసులు ఇంగ్లీష్ మరియు గుజరాతీ భాషలలో ద్విభాషా సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు, నివాసితులను పాన్ ఉమ్మివేయవద్దని హెచ్చరించారు. అయినా సరే వారిలో మార్పు రాలేదు. ఇప్పుడు 150 పౌండ్ల వరకు జరిమానా విధిస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని 500 చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2014లో, బ్రెంట్ కౌన్సిల్ లో పాన్ మరకలను శుభ్రం చేయడానికి 20,000 పౌండ్లు (రూ. 21 లక్షలు) ఖర్చు చేసిందని అక్కడి మీడియా వెల్లడించింది. ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేస్తున్న పాన్ దుకాణాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అక్కడి భారతీయులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ ప్రతిష్టను నాశనం చేయడానికి మాకు ఇతరులు అవసరం లేదని.. మన ప్రజలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తమ వంతు కృషి చేస్తున్నారని మండిపడుతున్నారు.




