తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు ఆసక్తికరంగానే మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడును, ఆయన రాజకీయ ధాటిని నేరుగా ఎదుర్కోలేక ప్రతిపక్షం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే, సీఎంకు కుడి, ఎడమ భుజాలుగా ఉంటూ అత్యంత సన్నిహితులుగా పేరున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలపై పకడ్బందీగా రాజకీయ కుట్రలకు తెరలేపినట్లు చర్చ జరుగుతోంది.
Also Read : నవ్యాంధ్ర చరిత్రలో కీలక అడుగు.. నేడు పార్లమెంట్ లో కీలక పరిణామం..!
రేవంత్ రెడ్డిని నేరుగా ఢీ కొట్టడం అంటే ప్రస్తుతం అసాధ్యమనేది రాజకీయ విశ్లేషకుల మాట. రేవంత్ రెడ్డికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. వీటికి తోడు.. తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఇప్పుడు రేవంత్‌కే మద్దతు ఇస్తున్నారు. దీంతో రేవంత్ నిర్ణయాలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు రేవంత్ వల్లే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని.. పార్లమెంట్, మునిసిపల్ ఎన్నికల్లో కూడా రేవంత్ వల్లే గెలిచామనేది కొంతమంది కాంగ్రెస్ నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు. అందుకే ప్రస్తుతం రేవంత్ దూకుడుకు బ్రేకులు వేయాలంటే.. ఆయనకు ప్రధాన బలాలుగా ఉన్న నాయకులను బలహీనపరచడమే సరైన మార్గమని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈ ఇద్దరు మంత్రులను ఏదో ఒక రకంగా ఇరకాటంలో పెడితే.. పరోక్షంగా ముఖ్యమంత్రిని కట్టడి చేయవచ్చని ప్రతిపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Also Read : ధర్నా వ్యవహారంపై సిఎం ఆరా.. షాక్ అయిన అధికారులు..!
ప్రస్తుత కాంగ్రెస్ కేబినెట్లో ఎంతో మంది సీనియర్ మంత్రులు, ఉద్దండులు ఉన్నారు. కానీ ప్రతిపక్షం పనిగట్టుకుని కేవలం పొంగులేటి, సీతక్కలనే టార్గెట్ చేయడం వెనుక ఖచ్చితంగా ఏదో పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందని సామాన్య ప్రజలు సైతం భావిస్తున్నారు. రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా, రాజకీయంగా అండగా నిలుస్తున్న ఈ నాయకులపై ఒత్తిడి పెంచడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

