పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా.. డ్రాగన్ గురించి ఒక అదిరిపోయే వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో క్రేజీ ఫీలింగ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్‌ను ఏకంగా హాలీవుడ్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. సాధారణంగా విమాన ప్రయాణ సీన్లను సెట్స్ వేసి లేదా గ్రాఫిక్స్ సాయంతో షూట్ చేస్తారు. కానీ ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఆ రూల్ బ్రేక్ చేసాడు.
Also Read : మెగా ఫ్యాన్స్ కు వెయింటింగ్ తప్పదా..? పెద్ది వాయిదా పడ్డట్టే..?
ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను నిజంగా ఎగురుతున్న విమానంలో షూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. గాలిలో ప్రయాణిస్తున్న విమానంలో ఎన్టీఆర్ చేసే ఈ విన్యాసాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని మూవీ టీం అంటుంది. ఈ క్రేజీ యాక్షన్ సీన్.. ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవడమే కాకుండా, కథలో అదిరిపోయే టర్నింగ్ పాయింట్ అని టాక్. ఇలాంటి రిస్కీ షాట్స్ కోసం అంతర్జాతీయ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్లు, టెక్నీషియన్లను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఏపీలో ముగిసిన మావోల శకం.. ఆపరేషన్ కగార్ సక్సెస్..!
గతంలో హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ వంటి సినిమాల్లో టామ్ క్రూజ్ ఇలాంటి సాహసాలు చేయగా, ఇప్పుడు మన తారక్ కూడా అలాంటి రియలిస్టిక్ యాక్షన్‌తో అలరించబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన విమానాన్ని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. దేవర తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లు, ఎన్టీఆర్ మాస్ పర్ఫార్మెన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. త్వరలోనే ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

