Tuesday, October 28, 2025 08:11 AM
Tuesday, October 28, 2025 08:11 AM
roots

అన్నా క్యాంటిన్లలో వారికి భోజనం ఉండదు..? సర్కార్ కీలక నిర్ణయం..!

2024 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఇచ్చిన హామీ.. తామ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని. చెప్పిన విధంగానే రాష్ట్రవ్యాప్తంగా 199 అన్నా క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మూడు పూటలా నాణ్యమైన భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే దీనిని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. కొన్నిచోట్ల మద్యం సేవించి భోజనానికి వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి.

Also Read : ఏబీ వెంకటేశ్వరరావు కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 199 అన్నా క్యాంటీన్లతో పాటుగా కొత్తగా ఏర్పాటు చేయబోయే మరో 63 అన్నా క్యాంటీన్ల విషయంలో భోజనం చేసేవారికి సంబంధించి నూతన మార్గదర్శకాలను సిద్దం చేస్తున్నారు. మద్యం సేవించి వచ్చేవారు.. భోజనం చేయకుండా కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ఈ మేరకు అన్నా క్యాంటీన్ల వద్ద ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read : చిరంజీవికి రామ్ చరణ్ రిక్వస్ట్.. తండ్రిని టార్గెట్ చేయడంతో జాగ్రత్తలు…!

అలాగే అన్నా క్యాంటీన్ల వద్ద ఎవరైనా గొడవలకు దిగినా క్యూ లైన్లు పాటించకుండా హడావిడి చేసిన వారిపై కూడా కఠిన చర్యలకు దిగాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కొంతమంది కావాలనే మద్యం సేవించి అన్నా క్యాంటీన్లకు వెళుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఒంగోలులో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే ఒక బోర్డు కూడా అక్కడ ఏర్పాటు చేసి మద్యం సేవించి వచ్చిన వారికి భోజనం లేదని తేల్చి చెప్పారు. ఇక అన్నా క్యాంటిన్ పరిసరాల్లో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా.. ప్రశాంత వాతావరణంలో భోజనం చేయకుండా ఇబ్బందులకు గురి చేసినా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇకనుంచి అన్నా క్యాంటీన్ వద్ద భోజన సమయాల్లో ఒక కానిస్టేబుల్ ను విధులు నిర్వహించేలా ఆదేశాలు విడుదల కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్