Tuesday, February 10, 2026 07:02 AM
Tuesday, February 10, 2026 07:02 AM

గంజాయిలో కూడా అరుణ పాత్ర..? చికెన్ వేస్ట్ లో గంజాయి..?

నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకుల నుంచి పోలీసుల వరకు తన చెప్పు చేతల్లో ఉంచుకున్న అరుణ వ్యవహారం అటు ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. అన్ని పార్టీల నాయకులతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆమె చేసే నేరాలకు పోలీసు అధికారులు పూర్తిగా సహకరించారని ఇదే సమయంలో రాజకీయ నాయకులు అండ దండలు కూడా అందినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కొన్ని కూని కేసుల్లో కూడా ఆమె నిందితురాలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read : ఆస్ట్రేలియా టూర్ కు జట్టు ఇదేనా..?వైస్ కెప్టన్ గా అతనే..!

ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఒక నెల్లూరుకు మాత్రమే ఆమె దందాలు పరిమితం కాలేదని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆమె కొందరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని దందాలు చేసినట్టు ఆమె ఫోన్ లో గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల చికెన్ వేస్ట్ కు కూడా ఆమె భారీగా వసూళ్లు చేసినట్లు ప్రచారం జరిగింది. కర్ణాటక నుంచి వచ్చే చికెన్ వేస్ట్ నెల్లూరులో చేపల చెరువుల్లో వినియోగిస్తూ ఉంటారు. ఇందులో కూడా ఆమె లక్షలు సంపాదించినట్లు గుర్తించారు. ఇదే సమయంలో అక్రమ రవాణా కూడా జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Also Read : ఎక్కడన్నా..? వైసీపీ కార్యకర్తలకు దొరకని జగన్

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ గంజాయికి రాజధానిగా మారిన సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడా గంజాయి దొరికిన దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే గుర్తించారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా కూడా అప్పట్లో హడావుడి చేసింది. ఇదే సమయంలో పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకుని అరుణ ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె ఫోన్లో ఉన్న కొన్ని కాంటాక్ట్లను పరిశీలించిన పోలీసులు.. విశాఖలోని గంజాయి వ్యాపారులతో సంభాషణలు కూడా జరిపినట్లు గుర్తించారని వార్తలు వస్తున్నాయి. ఐపీఎస్ అధికారులను కూడా తన బుట్టలో వేసుకున్న అరుణ.. వారి అండతోనే ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆమెకు పూర్తిగా సహకరించడంతో ఆమె చేసే కార్యక్రమాలకు అడ్డు లేకుండా పోయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ మాట మాట్లాడవద్దు.....

ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలల...

రూ.750 కోట్లు డిపాజిట్...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో...

అంబటి మరో పోసాని...

రాజకీయాల్లో నోటి దూల సహజమే.. అది...

చంద్రబాబుపై.. బీజేపీ ఎమ్మెల్యే...

ఒక వైపు ఏమో కమ్మ కులం...

రాజకీయాలకు కేసీఆర్ గుడ్...

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ...

కాంగ్రెస్‌తో జగన్ చేతులు...

దక్షిణాది రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు.. బెంగుళూరులో...

పోల్స్