తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద చాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నో ఉత్సవాలు నిత్యం తిరుమలలో జరుగుతూనే ఉంటాయి. కాని ఈ తరహా ఘటనలు మాత్రం ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 40 మంది గాయపడ్డారు. 32 మందిని ప్రధమ చికిత్స చేసి డిశ్చార్జ్ చేసారు వైద్యులు.
Also Read: రెబల్ ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ రెడీ చేసిన తమిళ డైరెక్టర్
ఈ తరుణంలో నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సినిమా డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కేన్సిల్‌ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అనంతపురంలో ఈరోజు సాయంత్రం జరగాల్సిన ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేసారు. ఎన్నికల అనంతరం బాలయ్యకు అనంతపురంలో తొలి సినిమా ఈవెంట్ కావడంతో అభిమానులు కూడా భారీగా హాజరు అయ్యే అవకాశం ఉందని భావించారు. భారీగా ఏర్పాట్లు చేసిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేసాయి.
Also Read: టీటీడీ సంచలన నిర్ణయం.. పది రోజులు ఆ దర్శనాలు రద్దు
సంక్రాంతి రేసులో ఈ నెల 12న విడుదలవుతున్న డాకు మహారాజ్ సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా నారా లోకేష్ హాజరు కావాల్సి ఉంది. తిరుపతి ఘటన వల్ల ఈవెంట్ రద్దు చేస్తున్నాం అని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. మన సంస్కృతి, సంప్రదాయాలు విరాజిల్లే తిరుపతి క్షేత్రంలో అలాంటి ఘటన జరగడం బాధాకరమని.. మా వేడుకను నిర్వహించుకోవడానికి ఇది సరైన తరుణం కాదని పోస్ట్ చేసారు. భక్తులను, వారి మనోభావాలను గౌరవిస్తున్నామని.. అందుకే మా వేడుకను రద్దు చేసుకుంటున్నాం, అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం అంటూ పోస్ట్ చేసారు.