Wednesday, August 5, 2026 12:13 PM
Wednesday, August 5, 2026 12:13 PM

తిరుపతిలో తీవ్ర విషాదం..!

తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. రెండు వేర్వేరు చోట్ల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య 6కి చేరింది. బైరాగిపట్టెడ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు.

Also Read : వారికి పదవులు లేవు.. లోకేష్ క్లారిటీ..!

శ్రీనివాస అతిథి గృహం దగ్గర జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. తొక్కిసలాట ఘటనలో మరో 15 మంది గాయపడ్డారు. బాధితులను రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న భక్తుల నమ్మకం. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు తరలివచ్చారు. ఉదయం నుంచి భక్తులు ఆ కేంద్రం వద్ద వేచి ఉన్నారు. క్యూలైన్ లోకి భక్తులను వదిలే క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది.

Also Read : ఫార్ములా ఈ రేస్ తో వైసీపీకి లింకులు..?

నిజానికి గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించుకుంది. అయితే, ఊహించని విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది.

భక్తులను క్యూలైన్ లోకి పంపేందుకు గేటు ఓపెన్ చేశారు. ఆ వెంటనే భక్తులు ముందుకు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరు భక్తులు కిందపడ్డారు. వారిని వెనకున్న వారు తొక్కేశారు. ఈ ఘటనలో కొందరు భక్తులు ఊపిరి ఆడక ప్రాణాలు వదిలినట్లు పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్