ఏది ఏమైనా వైసీపీ రాజకీయం మాత్రం కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. తమకు వ్యతిరేకంగా ఏ పరిస్థితి ఉన్నా సరే దాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు వైసిపి అనుకూల మీడియా రంగంలోకి దిగిపోతుంది. తాజాగా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ విషయంలో ఇలాగే జరిగింది. ఇటీవల వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా నందిగం సురేష్ ను పక్కకు నెట్టేసారని.. జగన్ భద్రతా సిబ్బంది కనీసం జగన్ వద్దకు వెళ్ళనీయలేదని.. ఆయన కాన్వాయ్ వద్దకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి.
Also Read : నందిగం సురేష్ ను దూరం పెట్టేసిన జగన్..?
దీనితో ఇప్పుడు.. జగన్ అనుకూల మీడియా రంగంలోకి దిగింది. నందిగం సురేష్ జైలు నుంచి విడుదలైన తర్వాత కనీసం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయని సాక్షి ఛానల్.. తాజాగా ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేసింది. ఆ ప్రచారం బయటకు వచ్చినప్పటి నుంచి.. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో పాటుగా ప్రకాశం జిల్లా నేతలు కూడా నందిగం సురేష్ ని కలుస్తున్నారు. ఆయనకు ఎప్పుడూ లేని సానుభూతి కూడా తెలుపుతున్నారు. ఇక నందిగం సురేష్ కూడా ఈ పరిస్థితులు చూసి కాస్త ఎమోషన్ అయిపోయారు.
Also Read : బాహుబలిలా టీడీపీ సోషల్ మీడియా
సాక్షి ఛానల్ తో మాట్లాడుతూ తనకు అధికారులు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని, తాను మాజీ ఎంపీని అయినా సరే కనీసం ఆ మాత్రం గౌరవం కూడా ఇవ్వలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత నందిగం సురేష్ అధికారులు తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. వాళ్లకు సాధ్యమైనంతవరకు తనను చాలా బాగా చూసుకున్నారని.. తనను ఎక్కడా ఇబ్బందులకు గురి చేయలేదని అన్నారు. ఇక తాజాగా మాట్లాడుతూ పై విధంగా కామెంట్స్ చేయడం గమనార్హం. బోనస్ గా తన అన్నను కూడా ఇబ్బందులకు గురి చేశారంటూ మాట్లాడారు. ఇలా 20 రోజుల వ్యవధిలో రెండు రకాల మాటలు మాట్లాడటంతో జనాలు షాక్ అయ్యారు.