Saturday, September 13, 2025 02:45 AM
Saturday, September 13, 2025 02:45 AM
roots

ఈసారి ముహూర్తం ఖరారు అయినట్లేనా..?

తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి మాత్రమే పదవులు ఇస్తామన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే టీటీడీ బోర్డు సహా రెండు విడతల్లో నామినేటెడ్ పదవుల జాబితా విడుదల చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 8 నెలలు గడిచిపోయాయి. దీంతో పలువురు సీనియర్ నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గతేడాది జూన్ 4న ఫలితాలు వచ్చిన వెంటనే.. ఆశావహులంతా తమ బయోడేటాను అధినేతకు అందించారు. అయితే తొలి, మలి జాబితాలో అవకాశం దక్కని వారంతా.. ఇప్పుడు ఖాయంగా ఇస్తారని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతికే లిస్ట్ వస్తుందని అంతా భావించారు. కానీ చంద్రబాబు మాత్రం మార్చి నెలాఖరు నాటికి అన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దీంతో నెల రోజులుగా పదవులు ఆశించిన వారంతా పార్టీ ఆఫీసు చుట్టూ, సీఎంవో చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Also Read : ఎమ్మెల్సీ అభ్యర్ధుల పై చంద్రబాబు సంచలన నిర్ణయం

ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదు. దీంతో గెలుపు లాంఛనమే అయినప్పటికీ అభ్యర్థి మెజారిటీ కోసం ప్రతి ఒక్కరు పని చేశారు. పదవులు ఆశిస్తున్న కొంతమంది నేతలను ఇంఛార్జులుగా నియమించింది పార్టీ. ఇప్పుడు ఆ ఇంఛార్జుల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో వచ్చిన మెజారిటీని పార్టీ అధిష్టానం విశ్లేషిస్తోంది. మెజారిటీ ఆధారంగా నేతలు ఏస్థాయిలో కష్టం చేశారనే విషయం అంచనా వేస్తున్నారు.

Also Read : ఒక్క వీడియోతో లోకేష్ ఆన్సర్ ఇచ్చేసారా..?

మార్చి 21తో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక కూడా ఈ నెల 20వ తేదీ. అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం 5 స్థానాలు కూడా కూటమి ఖాతాలోకే చేరనున్నాయి. కాబట్టి ఈ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ తర్వాత మార్చి 25 నుంచి 30 మధ్యలో పదవుల జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలనే విషయం దాదాపు ఖరారు చేసినట్లు పార్టీ పెద్దలు చెబుతున్నారు. వచ్చే ఆర్థిక ఏడాది నాటికి పదవుల ప్రకటన విడుదల అవుతుందనేది పార్టీలో వినిపిస్తున్న మాట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్