Monday, September 8, 2025 07:28 PM
Monday, September 8, 2025 07:28 PM
roots

బ్రాండ్ బిల్డప్.. గ్రాండ్ ఈవెంట్..!

బాబు అంటే ఓ బ్రాండ్.. అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబును ఓ రాజకీయవేత్తగా కంటే కూడా.. ఓ కార్పొరేట్ సంస్థ సీఈఓగానే గుర్తింపు ఎక్కువ. అప్పటి వరకు 10 వేలు కోట్లు కూడా దాటని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌‌ను ఏకంగా లక్ష కోట్లకు చేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు ఆకర్షించారు. అందుకే చంద్రబాబు పేరు చెబితే చాలు.. ఇప్పటికే కార్పొరేట్ సంస్థల్లో ఓ ప్రత్యేక గుర్తింపు.

Also Read : బ్రేకింగ్: లిక్కర్ కేసులో జగన్ ఆప్తులకు బెయిల్

ప్రస్తుతం చంద్రబాబు దృష్టి అంతా ఒకటే. అదే ఏపీ రాజధాని అమరావతికి గుర్తింపు తీసుకురావటం. వాస్తవానికి అమరావతి ప్లాన్ నిర్మించిన కొత్తల్లో గ్రాఫిక్ సిటీ అని నెగిటివ్ ప్రచారం చేశారు. ఇక అమరావతిపైన ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. ముంపు ప్రాంతమని.. కమ్మరావతి అని, అలల రాజధాని అని.. ఇలా నోటికి వచ్చిన పేర్లు పెట్టి అమరావతికి బ్రేక్ పడేలా కుట్రలు చేస్తున్నారనేది వాస్తవం.

అయితే అమరావతికి పూర్తిస్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు చంద్రబాబు మరో కీలక మార్గం ఎంచుకున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారంతా కేవలం చంద్రబాబును నమ్మి పెట్టుబడులు పెట్టిన వారే. భవిష్యత్తులో అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది అని చంద్రబాబు చెప్పిన మాటు నమ్మి పెట్టుబడులు పెడుతున్నారు. కానీ వాస్తవానికి అమరావతి గురించి చెప్పేందుకు ఎలాంటి గ్రాండ్ ఈవెంట్ ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం నిర్వహించలేదనే చెప్పాలి.

Also Read : కేంద్ర కేబినెట్ లోకి జనసేన ఎంపీ…?

ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. బ్రాండ్ బిల్డప్‌ను గ్రాండ్‌‌గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు.. ఈసారి మాత్రం ఆధ్యాత్మికతను కూడా జోడిస్తున్నారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాలను విజయవాడలో ఘనంగా నిర్వహిస్తారు. వాటిని ఈ ఏడాది మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మైసూర్ దసరా ఉత్సవాల మాదిరిగా విజయవాడ ఉత్సవ్ పేరుతో దసరా పండుగను నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు జరగనున్న నవరాత్రి మహోత్సవాల్లో ప్రధానంగా సినీ ఈవెంట్‌లను నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

వాస్తవానికి సినిమా ప్రీ రిలీజ్, సక్సెస్ మీట్‌లను ఎక్కువగా హైదరాబాద్‌లోనే నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా ఫంక్షన్‌లు కూడా హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. సినీ తారలను చూసేందుకు అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం వస్తారు. అందుకే విజయవాడ ఉత్సవ్‌లో రోజుకో సినిమా ఫంక్షన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సినీ తారలు పెద్ద ఎత్తున వస్తే.. ప్రజలకు కూడా విజయవాడ – అమరావతి గురించి వాస్తవాలు తెలుస్తాయనేది ప్రభుత్వ పెద్దల మాట. ఇప్పటికే ఏపీలో అటు శ్రీకాకుళం మొదలు.. ఇటు తిరుపతి వరకు సినిమాల షూటింగ్ జోరుగా జరుగుతోంది. విశాఖ, కోనసీమ, గోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతిలో షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫంక్షన్‌లు జరిగితే.. పరిశ్రమకు కూడా మేలు జరుగుతుందంటున్నారు సినీ ప్రముఖులు. బ్రాండ్ బిల్డప్ కోసం గ్రాండ్ ఈవెంట్లు నిర్వహించాలనే చంద్రబాబు ఆలోచనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

రేవంత్ గోప్యతకు కారణం...

రాజకీయాల్లో తెలంగాణ కాంగ్రెస్ కాస్త డిఫరెంట్...

సజ్జలపై జగన్ సీరియస్.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి...

రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల...

దేశ రాజకీయాల్లో వారసత్వం అనేది ఎప్పుడూ...

అసలు బీఆర్ఎస్‌లో ఏం...

తెలంగాణ అంటే కేసీఆర్... కేసీఆర్ అంటే...

మేడం గురించే చర్చ..!

రెండు రోజులుగా సోషల్ మీడియా మోత...

అవును.. వాళ్లు మాత్రమే...

వైసీపీలో చీలిక వచ్చిందనే చర్చ ఇప్పుడు...

పోల్స్