Saturday, March 28, 2026 06:14 PM
Saturday, March 28, 2026 06:14 PM

మళ్ళీ దొరికిపోయిన ధనుష్, మృణాల్..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ల పర్సనల్ లైఫ్ పై జనాలకు ఫోకస్ ఎక్కువ. ప్రేమ, పెళ్లి, విడాకులు వంటివి ఎంతో హడావుడి చేస్తూ ఉంటారు జనాలు. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ ఓ రేంజ్‌ లో వైరల్ అవుతుంటాయి. గత కొన్ని రోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ గురించి ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే హడావుడి జరిగింది. గత కొంతకాలంగా ధనుష్, మృణాల్ ఠాకూర్ తరచూ కలుస్తున్నారని, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగా జరిగింది.

Also read : ఆర్సీబీ, ఆర్ఆర్ అమ్మకంతో.. బీసీసీఐ ఖజానాలోకి రూ. 1500 కోట్లు..!

ఈ ఏడాది ఫిబ్రవరి 14న, అంటే వాలెంటైన్స్ డే రోజున వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని వెబ్‌ సైట్లు కథనాలు రాసాయి కూడా. ఓ పక్క ధనుష్ తన పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు పడుతున్న టైం లో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది. ఆ తర్వాత మృణాల్ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలు బ్రేక్ అయ్యాయి. కానీ తాజా హడావుడితో మళ్ళీ ఈ జంటపై రూమర్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం ‘డెకాయిట్’ హిందీ ప్రమోషన్లలో భాగంగా అడివి శేష్‌ తో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో మృణాల్ అనర్గళంగా తమిళంలో మాట్లాడింది.

Also read : వారికి దూరంగా ఉండండి.. జగన్ ఆదేశం..!

సాధారణంగా పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత సౌత్ ఇండియా భాషలు హీరోయిన్లు నేర్చుకుంటున్నారు. ఏదో రెండు ముక్కలు తమిళంలో మాట్లాడటం సహజమే గానీ.. మృణాల్ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తమిళ సినిమా కూడా చేయకుండా.. ఏ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా.. ఆమె అంత స్పష్టంగా తమిళం మాట్లాడటం వెనుక ధనుష్ శిక్షణే ఉండవచ్చు అంటూ తమిళ జనాలు చర్చించుకుంటున్నారు. ఇక పదే పదే చెన్నై కూడా వెళ్ళడంతో.. ధనుష్ కోసమే అనే రూమర్స్ కూడా వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

శాసససభలో సరే.. మండలిలో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన...

ద్వారంపూడికి చెక్..? ఫోకస్...

ఏపీలో కూటమి ప్రభుత్వం.. నామినేటెడ్ పదవుల...

వారికి దూరంగా ఉండండి.....

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్...

భారతీ సిమెంట్స్ కు...

గత మూడు నాలుగు నెలలుగా ఉత్కంట...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

రాష్ట్రంలోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యానికి...

ఏపీ లిక్కర్ కేసు.....

ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ...

పోల్స్