మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారు అనే దానిపై కూటమిలో ఇంకా అంగీకారానికి రాలేదని తెలుస్తోంది. రాజకీయంగా ఈ రాజ్యసభ ఎంపీ సీటు అత్యంత కీలకంగా మారింది. ముందు జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది అనే వార్తలు వచ్చాయి. నాగబాబుని ఎమ్మెల్సీగా ఎంపిక చేయకపోవడంతో రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే చివరకు నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు.
Also Read : ఎమ్మెల్సీ అభ్యర్ధుల పై చంద్రబాబు సంచలన నిర్ణయం
రాజ్యసభ పదవి విషయంలో కూటమి పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇప్పుడు ఓ కొత్త పేరు చర్చల్లోకి వచ్చింది. మాజీ కేంద్రమంత్రి, టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతిరాజుని రాజ్యసభకు పంపించే అవకాశం ఉండవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. ఆయనకు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దానికి తోడు పార్టీకి లాయల్ గా ఉండే నాయకుడిగా కూడా ఆయనకు పేరు ఉంది. దీనితో చంద్రబాబు నాయుడు మరోసారి ఆయనను రాజ్యసభకు పంపించే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
Also Read : గెలిచినా… ఉపయోగం లేకుండా పోయిందే..!
2024 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంటు నుంచి కలిసేట్టి అప్పలనాయుడు ఎంపీగా పోటీ చేశారు. ఇక విజయనగరం అసెంబ్లీ నుంచి.. అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి పోటీ చేసి విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి అశోక్ గజపతిరాజు సైలెంట్ గానే ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే చురుకుగా పాల్గొంటున్నారు. చంద్రబాబు.. అశోక్ గజపతిరాజు విషయంలో సానుకూలంగా ఉండటంతో ఆయనను మరోసారి పార్లమెంటుకు పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి దాదాపు మూడున్నరెళ్లు సమయం ఉంది. మరి ఈ విషయంలో టిడిపి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అటు జనసేన పార్టీ కూడా తమకు రాజ్యసభ సీటు కావాలని అడుగుతుంది. మూడు నెలల క్రితం భర్తీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో జనసేన పార్టీకి చోటు దక్కలేదు.




