Monday, March 30, 2026 03:49 PM
Monday, March 30, 2026 03:49 PM

25 కోట్ల ప్లేయర్.. ఒక్క బంతి కూడా వేయకుండానే..!

ఐపీఎల్ అనగానే భారీ ధర అనేది.. ఆటగాడి మీద అంచనాలు అదే రేంజ్ లో పెంచుతుంది. కానీ.. ఈ అంచనాలు నిలబెట్టుకునే విషయంలో మాత్రం ఆటగాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. తాజాగా జరుగుతోన్న 2026 సీజన్‌ లో అత్యంత భారీ ధరకు అమ్ముడైన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన కామెరూన్ గ్రీన్, ముంబై ఇండియన్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. కలకత్తా జట్టు యాజమాన్యం అతనిపై ఏకంగా రూ.25.20 కోట్లు కుమ్మరించింది. అయితే, జట్టు అత్యంత కీలకమైన సమయంలో అతను బ్యాటింగ్‌లో విఫలం కావడమే కాకుండా, కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది.

Also Read : శాసససభలో సరే.. మండలిలో చర్చ ఏమైంది..?

ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌ కు వచ్చిన గ్రీన్, కేవలం 10 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. భారీ స్కోరు సాధిస్తాడని ఆశించిన తరుణంలో బాధ్యతారహితంగా వికెట్ పారేసుకోవడం కేకేఆర్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ముంబై బ్యాటర్లు కేకేఆర్ బౌలర్లను చితక్కొడుతున్నా, గ్రీన్‌ తో కెప్టెన్ ఒక్క బంతి కూడా వేయించలేదు. ఒక స్టార్ ఆల్ రౌండర్‌ ను ఇంత భారీ ధరకు కొనుగోలు చేసినప్పుడు, అతను బౌలింగ్ చేయకపోవడం జట్టు వ్యూహాలపై అభిమానులు విమర్శలు చేస్తున్నారు.

Also Read : లిపోప్రొటీన్ ఏ.. ఫిట్‌గా ఉన్నవారికి కూడా గుండెపోటు ప్రమాదం..!

గ్రీన్ ఎందుకు బౌలింగ్ చేయలేదన్న విషయంపై కెప్టెన్ అజింక్య రహానె స్పందిస్తూ, ఈ ప్రశ్నను క్రికెట్ ఆస్ట్రేలియాని అడగాలని వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు విధించిన వర్క్‌ లోడ్ మేనేజ్‌మెంట్ నిబంధనల వల్ల గ్రీన్ బౌలింగ్‌ కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం బ్యాటర్‌ గా మాత్రమే ఆడే ఆటగాడి కోసం 25 కోట్లు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు గ్రీన్‌ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బీఎండబ్ల్యూ కారు కొని గ్యారేజీలో పెట్టినట్లు ఉంది గ్రీన్ పరిస్థితి అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆండ్రీ రస్సెల్ వంటి విధ్వంసకర ఆల్ రౌండర్ స్థానాన్ని భర్తీ చేస్తాడని భావిస్తే, కనీసం ఆరో బౌలింగ్ ఆప్షన్‌ గా కూడా పనికిరాకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాయుడుపై వేటు.. కొత్తగా...

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి...

ఒక్క కార్టూన్‌కే భయపడితే...

ఒక్క కార్టూన్‌కే భయపడితే ఎలా..? ఇప్పుడు...

ఒంటిమిట్ట కల్యాణం పౌర్ణమి...

కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి...

ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో...

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో...

చెల్లెలు కోసం అన్నకు...

తెలంగాణ రాజకీయాల్లో గత ఏడాది కాలంగా...

శాసససభలో సరే.. మండలిలో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన...

పోల్స్