Friday, September 12, 2025 07:29 PM
Friday, September 12, 2025 07:29 PM
roots

గండికోటలో దారుణం.. మైనర్ బాలిక మృతి..!

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రొద్దుటూరులోని గౌతమి కళాశాలకు చెందిన 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ కేసును అత్యాచారం, హత్యగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోకేష్ అనే యువకుడిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రొద్దుటూరు నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండికోటకు మోటార్‌ బైక్‌పై బాలికతో కలిసి లోకేష్ వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టోల్ గేట్ వద్ద సీసీటీవీలో లోకేష్ బైక్ డ్రైవింగ్ చేస్తుండగా.. యువతి వెనుక కూర్చున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.

Also read  : స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ..!

లోకేష్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉందా లేదా, బాధితురాలిపై లైంగిక దాడి జరిగిందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ప్రేమ పేరుతో లోకేష్ నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నందున కుటుంబం తమ స్వస్థలం నుండి ప్రొద్దుటూరుకు మకాం మార్చిందని బాలిక తండ్రి కొండయ్య పోలీసులకు తెలిపారు.

Also read  : తెలంగాణాలో కీలక అధికారుల అరెస్ట్..?

కాలేజీకి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో.. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. యువతి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. కాలేజ్ దగ్గర నుంచి అన్ని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా యువతి గండికోటకు వెళ్లినట్లు గుర్తించారు. ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడితో బాలిక ఇష్టపూర్వకంగా వెళ్లిందా.. లేక బలవంతంగా తీసుకెళ్లాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రముఖ పర్యాటక క్షేత్రం గండికోటలో మైనర్ మృతి కలకలం రేపుతోంది. క్లూస్ టీమ్ ఆధారంగా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్