Saturday, March 14, 2026 01:34 AM
Saturday, March 14, 2026 01:34 AM

కోహ్లీ, రోహిత్ ఫిట్.. గంభీర్ కు ఎన్సీఏ క్లారిటీ..!

టీం ఇండియా స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే కెరీర్ విషయంలో గత ఏడాది కాలంగా ఏదోక ప్రచారం జరుగుతూనే ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్‌ డే ప్రపంచకప్‌లో ఆడాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నా సరే.. సోషల్ మీడియాలో లేదంటే ఓ వర్గం మీడియాలో వస్తున్న కథనాలు ఫ్యాన్స్ కు, బోర్డుకు తలనొప్పిగా మారాయి. గత ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో, ఆ తర్వాత జరిగిన వన్డే సీరీస్ లలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు.

Also Read : పాండ్యా బిహేవియర్ పై విమర్శలు

ఫాం పరంగా గాని, ఫిట్నెస్ పరంగా గాని ఏ విధమైన ఆందోళన లేదనే విషయం అర్ధమవుతోంది. ఇక తాజాగా ఐపిఎల్ కు ముందు.. ఇద్దరూ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ టెస్ట్ కు హాజరైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎన్సియే వర్గాలు.. హెడ్ కోచ్ గంభీర్ కు రిపోర్ట్ కూడా పంపినట్లు సమాచారం. 2026 లో భారత్ సుమారు 18 వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ తో వన్డేలు పూర్తి కాగా.. ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక వంటి జట్లతో జరగనున్న ఈ సిరీస్‌ లు 2027 ప్రపంచకప్ కు జట్టును సిద్దం చేయడంలో భాగంగా ఉండనున్నాయి.

Also Read : విజయ్ దళపతికి అమెజాన్ బిగ్ షాక్..!

వచ్చే ఏడాది వరల్డ్ కప్ వరకు.. ఈ ఇద్దరు దాదాపు 35 వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఇప్పుడు ఐపిఎల్ కోసం కూడా ఇద్దరూ సిద్దమవుతున్నారు. ఐపిఎల్ జరిగే సమయంలోనే, జాతీయ జట్టు విషయంలో హెడ్ కోచ్ గంభీర్, సిఓఈ చీఫ్ లక్ష్మణ్, కెప్టెన్ గిల్ సమావేశం కానున్నారు. ఈ నేపధ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై కూడా వారి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై చర్చ అవసరం లేదనే విధంగానే వారి ఫిట్నెస్ పై బెంగళూరు నుంచి రిపోర్ట్ వెళ్ళినట్లుగా క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఎన్టీఆర్ ను అభిమానించే...

హెచ్ జే దొర.. ఈ తరానికి...

రాజకీయాల్లోకి అలేఖ్య రెడ్డి..!

అలేఖ్య రెడ్డి.. ఈ పేరు పెద్దగా...

రేవంత్‌ ధీమా.. మరి...

మీ పెట్టుబడులు సురక్షితం.. మీ పెట్టుబడికి...

జంతు కొవ్వుపై సుప్రీం...

గత ఏడాది కాలంగా తిరుమలలో కల్తీ...

ఆ స్కూల్ విద్యార్ధులకు...

మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఏపీ...

‘రాజనీతి సురేష్‌’ పై...

ఒక చిన్న వీడియోకు వేల కోట్ల...

పోల్స్