Friday, September 12, 2025 09:19 PM
Friday, September 12, 2025 09:19 PM
roots

వారికి పదవులు లేవు.. లోకేష్ క్లారిటీ..!

తెలుగుదేశం పార్టీలో పదవులకు తొలి నుంచి డిమాండ్ ఉంటుంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా పదవుల కోసం పోటీ మాత్రం తీవ్రస్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం పదవుల కోసం డిమాండ్ ఓ రేంజ్‌లో ఉంది. ఇందుకు ప్రధాన కారణం… గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో పలువురు టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది అయితే బయటకు రావడానికి భయపడిపోయారు. తప్పుడు కేసులు పెట్టిన వైసీపీ ప్రభుత్వం… నానా ఇబ్బందులు పెట్టింది. దీంతో అలా ఇబ్బందులు పడిన వారంతా ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు.

Also Read : వైసీపీ లో శ్యామల డామినేషన్.. మండిపడుతున్న నాయకులు

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుతో సహా రెండు విడతలుగా నామినేటెడ్ పదవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతలకు పదవులిచ్చారు చంద్రబాబు. అయితే మూడో లిస్ట్ ఎప్పుడనే చర్చ ప్రస్తుతం పార్టీలో జోరుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రెండు సార్లు పదవులు అనుభవించిన వారికి పదవులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అలాంటి వారు పై స్థాయి పదవులకైనా వెళ్లాలి… లేదంటే ఖాళీగా అయినా ఉండాలి అని సూచించారు. అంతే తప్ప… మరోసారి అదే పదవి ఆశించడం సరి కాదన్నారు.

Also Read : ఏపి కేబినేట్ లో భారీ మార్పులు ఖాయం..?

తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చే పార్టీ అని లోకేష్ వ్యాఖ్యానించారు. పార్టీలో ప్రతి ఒక్కరు కూడా పోలిట్‌బ్యూరో స్థాయికి రావాలని భావిస్తారని… అలాంటి వారికి సీనియర్లు తప్పకుండా అవకాశం ఇవ్వాలని లోకేష్ సూచించారు. రెండుసార్లు పదవులు అనుభవించిన వారు గౌరవంగా తప్పుకుంటే.. తర్వాత వాళ్లకు అవకాశం వస్తుందన్నారు. అలాగే పదవులు అనుభవించిన వాళ్లు పై స్థాయికి వెళ్లాలని సూచించారు. ఈ రూల్ తనకు కూడా వర్తిస్తుందన్నారు. రెండుసార్లు పదవులు అనుభవించిన తర్వాత ఒకసారి పక్కన ఉండేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు లోకేష్ తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం, పార్టీ పదవుల కోసం చాలా మంది ఆశగా ఎదురుచూస్తున్నారని… జనవరి నెలాఖరు నాటికి అన్ని పదవులు భర్తీ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో పార్టీలో ఎవరికి పదవులు వస్తాయో… ఎవరికి రావో క్లారిటీ ఇచ్చేశారు లోకేష్. ఇక పదవులపై ఆశలు పెట్టుకున్న వారు మరో నెల రోజులు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్