విశాఖ అంటే అందరికీ అరకు, లంబసింగి, ఆర్కే బీచ్, కైలాసగిరి, సింహాచలం.. ఇలా పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలు గుర్తుకు వస్తాయి. కానీ తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విశాఖ రూపు రేఖలు మారిపోయాయి. మొదటి నుంచి సిటీ ఆఫ్ డిస్టినీ అనే పేరున్న విశాఖకు ఏపీ ఐటీ శాఖ మంత్రి కొత్త పేరు పెట్టారు.
Also Read : ఎన్డియే వ్యూహంతో బిజెపిని మమత దెబ్బ కొడతారా..?
పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంగా మారింది. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో పలు అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇక ఇప్పటికే విశాఖలో సుమారు లక్షా 30 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు గూగుల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచంలో అమెరికా బయట గూగుల్ ఏర్పాటు చేయనున్న అతి పెద్ద డేటా సెంటర్ విశాఖలో మాత్రమే అని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
తాజాగా విశాఖలో మరో భారీ సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ జేవీ డిజిటల్ కనెక్షన్ సంస్థ విశాఖలో 98 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. 400 ఎకరాల విస్తీర్ణంలో ఒక వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఇది గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఉన్న వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్‌కు అనుబంధంగా పని చేస్తుందని రిలయన్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఏఐ ప్రాసెసర్ల ద్వారా డేటా నిల్వ చేసేలా అత్యాధునిక టెక్నాలజీతో వివిధ సంస్థల అవసరాలకు తగినట్లుగా సంస్థ తీర్చిదిద్దనుంది.
Also Read : టీడీపీలోకి మరో వారసురాలు..?
ఈ విషయాన్ని అధికారికంగా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. విశాఖకు ఐటీ పరిశ్రమలు రావడానికి అనుకూల వాతావరణం ఉందని భరోసా ఇచ్చారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడంతో విశాఖ ఇంటర్నేషనల్ మ్యాప్‌లోకి చేరింది. ఈ నేపథ్యంలో విశాఖకు లోకేష్ కొత్త పేరు పెట్టారు. డేటా కాపిటల్ ఆఫ్ ఇండియా అని విశాఖను లోకేష్ అభివర్ణించారు. వరుస పెట్టుబడులతో ఏపీలో ఐటీతో పాటు అనేక రంగాల్లో కొత్త టెక్నాలజీ ఎకో సిస్టం ఏర్పాటవుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. లోకేష్ ప్రకటనతో ఇక మీదట విశాఖ డేటా క్యాపిటల్‌గా మారనుంది.

