Friday, September 12, 2025 09:15 PM
Friday, September 12, 2025 09:15 PM
roots

దావోస్ లో లోకేష్ స్పీడ్.. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను సాధించే లక్ష్యంతో దావోస్ లో అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ కంపెనీలను రాబడుతున్నారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్ జాన్ డ్రూతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడ, తిరుపతి లలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ట్రేడ్ హబ్ ను ఏర్పాటు చేయండని విజ్ఞప్తి చేసారు మంత్రి.

Also Read : ఏపీ, తెలంగాణా మధ్య కృష్ణా జలాల రచ్చ…? పరిష్కారం దొరికేనా…?

చిన్న తరహా పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ కు సహకరించాలని కోరారు నారా లోకేష్. అలాగే హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో హైవోల్టేజీ డైరెక్ట్ కరెంట్ సాంకేతికతకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. సమర్థ పవర్ ట్రాన్స్‌ మిషన్ కోసం హెచ్‌వీడీసీకి సహకరించాలని విజ్ఞప్తి చేసారు. విశాఖ మెట్రో, గ్రీన్ ఎనర్జీకి సాంకేతిక సహకారం అందించాలని లోకేష్ ఈ సందర్భంగా కోరారు. ఇన్నోవేషన్ పార్కు స్థాపనకు మద్దతు ఇవ్వాలని భరత్ కౌశల్ ను కోరిన లోకేష్… నైపుణ్యాభివృద్ధికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేసారు.

Also Read : ఏబీవీపై కేసు పెట్టాలంటున్న సాక్షీ.. మరి విజయసాయి రెడ్డిని ఏం చేయాలి…?

అదే విధంగా వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచించాలని మంత్రి కోరారు. ఇక ఈ సందర్భంగా వారికి ఏపీలో అమలు చేస్తున్న పలు నిర్ణయాలను వివరించారు. జేసీహెచ్-ఐఎన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ప్రారంభించామన్నారు. తిరుపతి, విజయవాడ, కాకినాడలో కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. అనంతపురం, బొబ్బిలిలో మరో 2 కేంద్రాలు…ఏపీలో డబ్ల్యూటీఈ ప్లాంట్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నామన్నారు. కడప, అనంతపురం, తాడేపల్లిగూడెంలో డబ్ల్యూటీఈ ప్లాంట్ల నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు.

కంపెనీ సహచరులతో చర్చించి ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం : హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్