Thursday, March 12, 2026 01:31 AM
Thursday, March 12, 2026 01:31 AM

బ్రేకింగ్: పాదయాత్రకు సిద్దమవుతోన్న కేటిఆర్..?

తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని.. ఆ పార్టీ అధినాయకత్వం తీవ్రంగా కష్టపడుతోంది. ఈ నేపద్యంలోనే కొంత పార్టీలో మార్పులు చేసేందుకు.. అలాగే ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఇటీవలికాలంలో కల్వకుంట్ల కవిత కారణంగా.. జరిగిన నష్టాల్ని భర్తీ చేసే దిశగా కూడా పార్టీ అడుగులు వేస్తోంది. ఇక పార్టీ ప్రజల్లో ఉండాలి అంటే.. పాదయాత్ర ముఖ్యమనే భావనలో.. మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నట్లుగా సమాచారం.

Also Read : హైదరాబాద్ హాస్టల్స్ కష్టాలు.. పూరి, దోశ బంద్..!

కేసీఆర్ ఇప్పట్లో బయటికి వచ్చే సంకేతాలు కనబడటం లేదు. ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను కేటీఆర్ భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జూన్ నెల నుంచి.. పాదయాత్ర మొదలుపెట్టే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. తన పొట్ట కు సంబంధించి ఇన్నాళ్ళు పొట్ట దాచుకోలేక ఇబ్బంది పడుతున్నాను అంటూ.. ఆయన కామెంట్ చేసారు.

Also Read : దానంకు క్లీన్ చిట్.. కేటీఆర్ ట్విట్..!

ఆరు నెలల తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ప్రారంభించాను అని.. ఈ జూలై నాటికి తనకు 50 ఏళ్లు పూర్తవుతాయని, అప్పటికి నా శరీరాకృతి మారుతుందని ఆశిస్తున్నాను అంటూ జిమ్ లో ఉన్న ఫోటో కూడా షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన వారు కేటీఆర్ పాదయాత్ర కోసం రెడీ అవుతున్నారు అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా కొన్ని ప్రాంతాల్లో చేసిన పాదయాత్ర పార్టీకి కలిసి వచ్చింది. ఇక గులాబీ పార్టీ క్రమంగా బలహీనపడుతున్న నేపథ్యంలో పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లాలని కేటీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సీఎం.. ముహూర్తం...

​బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్...

హైదరాబాద్ హాస్టల్స్ కష్టాలు.....

దేశ వ్యాప్తంగా ఎల్ పీ జీ...

పెంచలయ్య సరే.. మరి.....

తిరుమల పరకామణిలో బంగారం, వెండి అపహరణకు...

రైతన్నలకు సిఎం చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సిఎం చంద్రబాబు...

దానంకు క్లీన్ చిట్.....

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

ఏపీ క్యాబినెట్‌లో మార్పులు.....

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి...

పోల్స్