Friday, September 12, 2025 09:05 PM
Friday, September 12, 2025 09:05 PM
roots

రాహుల్‌ లైన్లోకి వచ్చేసాడు.. భారత్ కష్టాలు తీరినట్టేనా..?

ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఘనంగా ప్రారంభించాడు. రెండవ అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించే ఇంగ్లాండ్ మైదానాల్లో.. రాహుల్ కు మంచి రికార్డు ఉంది. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడు రాహుల్. ఇంగ్లాండ్ పర్యటన అత్యంత కీలకంగా కావడంతో రాహుల్ ముందుగానే ఇంగ్లాండ్ చేరుకున్నాడు.

Also Read : అరెస్ట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో సంచలనం

తాను ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొంటానని బీసీసీఐకి లేఖ రాసిన రాహుల్.. వెళ్లిన వెంటనే సెంచరీ తో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ల దాటికి సహచర ఆటగాళ్ల వికెట్లు కోల్పోతున్న సరే.. రాహుల్ మాత్రం నిలకడగా ఆడాడు. స్వింగ్ కు అనుకూలించే పిచ్ మీద అద్భుతమైన బ్యాటింగ్ తో దుమ్ము రేపాడు. గత ఏడాది పెద్దగా ఫామ్ లో లేని రాహుల్ ఆస్ట్రేలియా పర్యటన తర్వాత లైన్లోకి వచ్చాడు. ఇక చాంపియన్ ట్రోఫీతో పాటుగా ఇటీవల జరిగిన ఐపిఎల్ సీజన్ లో కూడా రాహుల్ మెరుగైన ప్రదర్శన చేశాడు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని లోటును రాహుల్ ఖచ్చితంగా తీరుస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఇంగ్లీష్ టూర్ ముందు రెండు దేశాలు కీలక నిర్ణయం

పేస్ బౌలింగ్ అటాక్ కు అనుకూలించే పిచ్ ల మీద రాహుల్.. ముందు నుంచి ఇదే స్థాయిలో ప్రదర్శన చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ సిరీస్ లో రాహుల్ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాడని చెప్పవచ్చు. అటు కరున్ నాయర్ కూడా ఫామ్ లో ఉండటంతో సీనియర్లు లేని లోటు కనబడే అవకాశం లేదని క్రికెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈనెల 20 నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. రాహుల్ ఇదే నిలకడ టెస్ట్ సిరీస్ లో కూడా కొనసాగిస్తే భారత బ్యాటింగ్ కు వెన్నుముకగా మారటం ఖాయం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్