Monday, October 20, 2025 04:44 AM
Monday, October 20, 2025 04:44 AM
roots

9 ఏళ్ళ తర్వాత.. తీరిన రాహుల్ దాహం..!

భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్ లో టీం ఇండియా పట్టు బిగిస్తోంది. తొలి రోజు విండీస్ ను తక్కువ పరుగులకే కట్టడి చేసిన భారత్.. అక్కడి నుంచి బ్యాటింగ్ లో దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ కెఎల్ రాహుల్ ఆట తీరు ఎంతగానో ఆకట్టుకుంది. విండీస్ కు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వని రాహుల్.. టెస్ట్ కెరీర్ లో 11 వ శతకం నమోదు చేసాడు. ఆస్ట్రేలియా సీరీస్ నుంచి ఫాంలోకి వచ్చిన ఈ బెంగళూరు ఆటగాడు.. అక్కడి నుంచి జట్టులో కీలకంగా మారాడు.

Also Read: దేశానికి గుండెకాయ ఈ రైల్వే స్టేషన్..!

ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ పర్యటనలో ఎంతో అద్భుతంగా రాణించాడు రాహుల్. ఇక ఇప్పుడు విండీస్ పర్యటనతో ఈ సీజన్ ను ఘనంగా ప్రారంభించాడు అనే చెప్పాలి. దీనితో 9 ఏళ్ళ తర్వాత రాహుల్ స్వదేశంలో తొలి సెంచరీ చేసాడు. ఇంగ్లాండ్ పై చెన్నైలో 2016 లో 199 పరుగుల వద్ద అవుట్ అయిన రాహుల్.. ఆ తర్వాత మళ్ళీ స్వదేశంలో సెంచరీ చేయలేదు. క్రీజ్ లో నిలకడగా ఆడుతోన్న రాహుల్.. లంచ్ తర్వాత వికెట్ సమర్పించుకున్నాడు. వారికన్ బౌలింగ్ లో గ్రీవ్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

Also Read: హెచ్ 1 బీలకు మరో షాక్ తప్పదా..?

ఈ మ్యాచ్ లో గిల్ తో కలిసి 98 పరుగులు, జైస్వాల్ తో 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కెప్టెన్ గిల్ అర్ధ సెంచరీ తర్వాత స్లిప్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో వికెట్ కీపర్ జూరెల్, ఆల్ రౌండర్ జడేజా ఉండగా.. తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ ఆధిక్యంపై కన్నేసింది. ప్రస్తుతం 90 పరుగుల ఆధిక్యం లో ఉంది. అయితే పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండటంతో మూడవ రోజునే మ్యాచ్ ముగిసిపోయే సంకేతాలు దాదాపుగా కనపడుతున్నాయి. కాగా మొదటి ఇన్నింగ్స్ లో విండీస్ 162 పరుగులకే ఆల్ అవుట్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్