ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజును కస్టడీలో చిత్ర హింసలకు గురి చేసిన అప్పటి సిఐడీ అధికారి విజయ్ పాల్ కు 14 రోజుల పాటు గుంటూరు కోర్ట్ రిమాండ్ విధించింది. దీనితో విజయ్ పాల్ ను కస్టడీ కోరిన పోలీసులు… రఘురామకృష్ణరాజు ను వేదించిన వ్యవహారంలో కుట్ర దాగి ఉందని పోలీసులు వెల్లడించారు. కుట్రదారులు ఎవరో తేలాలంటే పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసులు కోర్ట్ ను కోరారు. ఇక ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలను అధికారులు ప్రస్తావించారు.
Also Read: ఏపీ రాజ్యసభ అభ్యర్ధులు ఫైనల్ అయినట్లే…?
రఘురామకృష్ణరాజు అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదంటూ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పోలీసులు… ఆర్ఆర్ఆర్ అరెస్టు సమయంలో ఉన్న కుటుంబ సభ్యులను దర్యాప్తులో భాగంగా విచారించామని తెలిపారు. విజయ్ పాల్ దురుసుగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కస్టడి సమయంలో ఉన్న పోలీసులు వాంగ్మూలం రికార్డ్ చేసారు అధికారులు. అరుపులు, కేకలు విన్నట్లు సిఐడి కానిస్టేబుల్స్ విచారణలో వెల్లడించారు. కస్టడీ సమయంలో జరిగిన విషయాలను బయటకు వెల్లడించవద్దని అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ హెచ్చరించారట.
Also Read: పంతం నెగ్గించుకున్న రఘురామ..!
ముఖానికి కర్చీఫ్ లు కట్టుకొని నలుగురు వచ్చినట్లు సిఐడి సిబ్బంది బయట పెట్టారు. జిజిహెచ్ వైద్యులపై ఒత్తిడి తెచ్చి రిపోర్ట్ తయారు చేసినట్లు వైద్యులు ఒప్పుకున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. ఆర్మి వైద్యశాల ఇచ్చిన రిపోర్ట్ లో ఆర్ఆర్ఆర్ కాళ్ళపై ప్రాక్చర్స్ ఉన్నాయని… దర్యాప్తు అధికారిగా విజయ్ పాల్ నిబంధనలు పాటించకపోవడమే కాకుండా తప్పుడు రిపొర్ట్ ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. విజయ్ పాల్ ను ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్ట్ కు తెలిపారు.