ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారం విషయంలో… బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజు… గత ఏడాది నుంచి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సుప్రీం కోర్ట్ లో ఆయన పిటీషన్ దాఖలు చేసారు. అప్పటి నుంచి ఈ పిటీషన్ విషయంలో ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. తనను నానా ఇబ్బందులు పెట్టిన జగన్ విషయంలో రఘురామ పట్టుదలగా ఉన్నారు. సుప్రీం కోర్ట్ లో ఈ కేసు పలుమార్లు విచారణకు వచ్చింది. ఇక నేడు జరిగిన విచారణలో కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read : ఇల్లు కంటే జైలు బెటర్.. ఏపీలో ఇదే హాట్ టాపిక్
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ పురోగతి ఏ దశలో ఉందని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం… సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో జగన్ అక్రమాస్తుల పై దాఖలైన కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. రోజూ వారీ విచారణకు ఆదేశించినా ఎక్కడ ఆటంకం కలుగుతుందని ప్రశ్నించిన ధర్మాసనం.. ఏఏ కోర్టులలో ఏఏ కేసులు దాఖలయ్యాయి… వాటి విచారణ ఏ దశలో ఉందో తెలుపుతూ సమగ్రంగా పట్టిక రూపంలో ఇవ్వాలని సిబిఐని కోర్ట్ ఆదేశించింది.
Also Read : హీరోకు 300 కోట్లు.. అభిమానుల జేబులకు మాత్రం చిల్లు
అఫిడవిట్ రూపంలో ఇచ్చిన పట్టిక చూసిన తరువాత ఏం చేయాలో చెబుతామని జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని వివరాలతో రెండు వారాల్లో దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. జగన్ బెయిల్ రద్దు చేయడమే కాకుండా కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ గతంలో సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసారు రఘురామ. ఇక తదుపరి విచారణను ఢిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది కోర్ట్. కాగా జగన్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా కోర్ట్ విచారణకు హాజరు కాకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి.