Sunday, September 14, 2025 05:46 PM
Sunday, September 14, 2025 05:46 PM
roots

అజ్ఞాతంలోకి మాజీ మంత్రి..!

వైసీపీ నేతలకు భయం పట్టుకుంది. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కావాల్సినంత అవినీతి చేశారు. అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రత్యర్థులపై దాడులకు తెగబడ్డారు. అందినంత మేర ప్రకృతి సంపదను దోచేశారు. మళ్లీ గెలుస్తామనే ధీమాతో చెలరేగిపోయారు. అయితే ఘోర పరాజయం తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాక.. ఒక్కొక్కరుగా అండర్ గ్రౌండ్‌లోకి పారిపోతున్నారు. తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కూడా నాలుగు రోజులుగా కనిపించటం లేదంటున్నారు సొంత పార్టీ నేతలు.

Also Read : నీ తాట తీస్తా.. రెచ్చిపోయిన దువ్వాడ..!

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన కాకాణి గోవర్థన్ రెడ్డి.. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు. నా మాటే శాసనం అన్నట్లుగా చెలరేగిపోయారు. 2016లో నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు కాకాణి. ఆ తర్వాత 2011లో వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు సర్వేపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ ప్రభుత్వంలో 2019 నుంచి అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నాడు. 2022 ఏప్రిల్ 11న జగన్ మంత్రివర్గంలో వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా చేరారు. నాటి నుంచి అడ్డే లేకుండా రెచ్చిపోయారు. టార్గెట్ టీడీపీ అన్నట్లుగా దాడులకు తెగబడ్డారు. అదే సమయంలో అవినీతికి తెరలేపారు కూడా.

Also Read : నాగబాబుకు బ్రేక్.. కారణమిదే..!

అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు జిల్లాలో మైనింగ్ మాఫియాకు కాకాణి నాయకత్వం వహించాడనేది ప్రధాన ఆరోపణ. తాటివర్తిలోని రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌కు సహకరించారనేది కాకాణి గోవర్థన్‌ రెడ్డిపై ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. దీంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు హైకోర్టులో కాకాణి గోవర్థన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు… పిటిషన్‌ను మంగళవారానికి వాయిదా వేసింది. ఉగాది, రంజాన్ పండుగల కారణంగా కోర్టుకు రెండు రోజుల పాటు సెలవు వచ్చింది. వరుస సెలవులు రావడంతో పోలీసులు అరెస్టు చేస్తారని భావించిన కాకాణి గోవర్థన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం పార్టీ నేతలు, కార్యకర్తలతో తన నివాసంలో కాకాణి భేటీ అయ్యారు. ఆ సమయంలో ఓ ఫోన్ రావడంతో.. సైలెంట్‌గా వెళ్లినట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి లాయర్ ఫోన్ చేశారని కార్యకర్తలకు చెప్పిన కాకాణి.. అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ అని వస్తోందని అభిమానులు చెబుతున్నారు. అరెస్టు భయంతోనే కాకాణి పారిపోయి ఉంటాడని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

చంద్రబాబు అలా ఎందుకన్నారు..?

ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే వ్యాఖ్యలు చాలా...

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

పోల్స్