ఐపిఎల్ మ్యాచ్ లు రోజు రోజుకు రసవత్తరంగా జరుగుతున్నాయి. పలు మ్యాచ్ లు అభిమానులకు వినోదాన్ని పంచుతున్నాయి. అయితే వివాదాలు కూడా క్రమంగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం.. అంటే బుధవారం గౌహతిలోని బరస్పరా క్రికెట్ స్టేడియంలో.. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ తీరుపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
Also Read : భారత్ పై మయన్మార్ భూకంప ప్రభావం
కలకత్తా ఆటగాడు క్వింటన్ డి కాక్ సెంచరీ అడ్డుకోవడానికి ఆర్చర్ చేసిన ఓ పనిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ లో డికాక్ 97 పరుగులు చేసాడు. అతను సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. కాని అనూహ్యంగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ వచ్చి.. సెంచరీ అడ్డుకునే ప్రయత్నం చేసాడు. కావాలని వైడ్ లు వేస్తూ.. అతనికి సెంచరీ చేసే అవకాశం లేకుండా చేసాడట. దీనిపై నెటిజన్లు చరిత్ర బయటకు తీస్తూ ఆర్చర్ ను.. రాజస్థాన్ జట్టును తిట్టడం మొదలుపెట్టారు.
Also Read : ఇంగ్లాండ్ తో సీరీస్ కు ముందు రోహిత్ సంచలనం
దక్షిణాఫ్రికా జట్టులో ఉన్నప్పుడు నల్ల జాతీయులతో డికాక్ కు విభేదాలు ఉన్నాయి. తెంబా బవూమాకు సారధ్య బాధ్యతలను ఇవ్వడాన్ని కూడా డికాక్ వ్యతిరేకించాడు. నల్ల జాతీయులకు మద్దతుగా జరిగిన పోరాటంలో కూడా అతను పాల్గొనలేదు. మైదానంలోనే అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ కోపంతోనే ఆర్చర్ ఆ విధంగా బౌలింగ్ చేసి ఉంటాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అయితే ఫిక్సింగ్ అనేది రాజస్థాన్ కు కొత్త కాదని.. వరస్ట్ టీం అంటూ తిట్టడం మొదలుపెట్టారు.