Wednesday, May 6, 2026 09:19 PM
Wednesday, May 6, 2026 09:19 PM

స్టార్ హీరోయిన్లకు చెమటలు పట్టిస్తున్న కొత్త ముద్దుగుమ్మ

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అంటే ఆషామాషీ కాదు. ఒక్క సినిమా తో స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంటే అంతలోనే మళ్ళీ పాతాళానికి పడిపోయిన వారు కూడా ఉన్నారు. కొంతమంది మాత్రం వచ్చిన అవకాశాన్ని బాగా వాడుకుంటూ చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోతారు. ఇక ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.

ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అయినా జాన్వీ కపూర్ కూడా అలాంటి కోవకే చెందుతుందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈమె ఎన్టీఆర్ సరసన దేవర సినిమా చేస్తుంది. ఇక ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో వచ్చే సినిమాలో కూడా తనే హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాల్లో కూడా తననే హీరోయిన్ గా తీసుకోవాలని స్టార్ హీరోలు సైతం చూస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ అమ్మడు ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయకముందే తెలుగులో మంచి ఆఫర్లను అందుకుంటుంది.

ఇక ఈమె క్రేజ్ చూసిన స్టార్ హీరోయిన్స్ అయిన రష్మిక మందాన, శ్రీలీలా, పూజా హెగ్డే లాంటివారు కుళ్లుకుంటున్నారనే చెప్పాలి. ఇక వాళ్ళకు చెక్ పెడుతూ జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలైతే తెలియజేస్తున్నారు. ఇక నిజానికి తను చేస్తున్న ఒక్క సినిమా రిలీజ్ కాకముందే ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలను లైన్ లో పెట్టింది అంటే ఆమె ఇప్పటికే స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాలి.

దేవర సినిమా హిట్ అయిందంటే ఈ అమ్మడు ఫేట్ మారిపోతుందనే చెప్పాలి. ఇక ఈమె ఎంత డిమాండ్ చేస్తే అంత డబ్బులు ఇచ్చి అయినా సరే ప్రొడ్యూసర్లు ఈమెనే తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ అమ్మడు తనదైన రీతిలో సినిమాలను చేస్తూ తొందరలోనే తల్లిని మించిన కూతురుగా గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్