బడ్జెట్ అయిపోయిన 5 రోజుల తర్వాత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. అసెంబ్లీ సమావేశాలపైన, కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైన విమర్శలు చేశారు. కూటమి సర్కార్ కేటాయింపులన్నీ తప్పుల తడకలని.. ఐదేళ్ల తమ పాలనలోనే ప్రజలంతా హాయిగా ఉన్నారని… అన్ని వర్గాలకు న్యాయం జరిగిందంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఇదే సమయంలో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అదే వ్యతిరేక ధోరణి ప్రదర్శించారు. తమకు 40 శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి… ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటే పాడిందే పాత పాట పాడారు తప్ప… వచ్చిన సీట్లను బట్టి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కేటాయిస్తారనే చిన్న విషయాన్ని జగన్ మర్చిపోయారు.
Also Read: జగన్ పై లోకేష్ సంచలన కామెంట్స్
అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు మాత్రమే ఉంటాయని… కాబట్టి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని పదేపదే అదే మాట అంటున్నారు తప్ప.. భారత రాజ్యాంగంలో చట్టసభల్లో ప్రతిపక్ష హోదా రావాలంటే.. పదిశాతం సీట్లు సాధించాలనే నియమం ఉందనే విషయాన్ని జగన్ ఎందుకు గుర్తించడం లేదనేది ఏపీలో రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు ముఖం చెల్లని జగన్… బడ్జెట్ ప్రవేశపెట్టిన 5 రోజుల తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రెస్ మీట్ పెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం మంజూరు చేసిన సీ పోర్టులు, కొత్త మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ హార్బర్లు, షిఫ్ ల్యాండింగ్ సెంటర్లు వైసీపీ హయాంలోనే పనులు శరవేగంగా సాగాయని గొప్పలు చెప్పుకున్నారు. విద్యా సంస్కరణలు తీసుకువస్తే… వాటిని కూటమి ప్రభుత్వం నాశనం చేసిందంటూ గగ్గోలు పెట్టారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ అంటూ నోరు పారేసుకున్నారు. పవన్ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడన్నారు జగన్.
Also Read: రాజ్యసభ సీటుపై కూటమి సంచలన నిర్ణయం…?
జగన్ వ్యాఖ్యలకు జనసేన పార్టీ నేతలు ధీటుగా జవాబిస్తున్నారు. జగన్ కోడి కత్తికి ఎక్కువ… గొడ్డలికి తక్కువ అని మేము కూడా అనొచ్చు అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా బదులిచ్చారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసన్నారు. జగన్ ఐదేళ్ల పాటు విధ్వంస పాలన సాగించిన విషయం ఏపీలో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. అందుకే ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయన్నారు మంత్రి మనోహర్. అసలు ప్రతిపక్షమే అవసరం లేదన్న వ్యక్తి… ప్రతిపక్ష హోదా కావాలని ఎలా అడుగుతారని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ ఘాటుగా బదులిచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. పవన్‌పై విమర్శలు చేస్తేనే పబ్లిసిటీ వస్తుందని జగన్ భావిస్తున్నాడని… ఇప్పుడు కూడా నియంత అని భావిస్తున్నాడన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే రాదని… కనీసం పది శాతం సీట్లు సాధించిన పార్టీని ప్రతిపక్షంగా స్పీకర్ గుర్తిస్తారనే విషయం కూడా జగన్‌కు తెలియదా అని ఎద్దేవా చేశారు జనసేన పార్టీ నేతలు.