Tuesday, September 9, 2025 08:57 PM
Tuesday, September 9, 2025 08:57 PM
roots

ట్రంప్ నుంచి ప్రపంచాన్ని రక్షించాలి.. జై శంకర్ ఆసక్తికర కామెంట్స్

రెండవ సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. భారత్ విషయంలో ట్రంప్ వైఖరికి ప్రపంచ దేశాలు సైతం షాక్ లోనే ఉన్నాయి. నమ్మకమైన స్నేహితుడిగా ఉన్న భారత్ ను కక్ష సాధింపు చర్యలతో ట్రంప్ ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఇటీవల సుంకాల వ్యవహారంపై భారత్ ఆగ్రహంగా ఉంది. రష్యాతో చమురు ఒప్పందాల కారణంగా ట్రంప్ రెండు విడతల్లో 50 శాతం సుంకాలు విధించారు. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేసారు.

Also Read : రేవంత్ గోప్యతకు కారణం అదేనా..?

సోమవారం జరిగిన వర్చువల్ సమ్మిట్ సందర్భంగా జై శంకర్.. బ్రిక్స్ దేశాలకు ఓ విజ్ఞప్తి చేసారు. ట్రంప్ అన్యాయమైన వాణిజ్య పద్ధతులను వ్యతిరేకిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంపై దృష్టి పెట్టాలని బ్రిక్స్ సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసారు. డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాల ప్రభావంపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ట్రంప్ నుంచి ప్రపంచ వాణిజ్య వ్యవస్థను రక్షించాలని కోరారు. ప్రపంచ దేశాల మధ్య ఆరోగ్యకరమైన సుంకాలు, వాణిజ్య ఒప్పందాలు ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

Also Read : గంభీర్ కి చెక్ పెడుతున్న బోర్డ్..? షాకింగ్ నిర్ణయం..!

అన్ని దేశాలను ప్రోత్సహించాలని, కక్ష సాధింపు సుంకాలు భావ్యం కాదని కామెంట్ చేసారు. కాగా బ్రిక్స్ దేశాలు ఇప్పుడు అమెరికాకు అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రముఖంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిపి బ్రిక్స్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 5 దేశాల ప్రభుత్వాల కూటమి ఇది. 5 సభ్య దేశాలతో బ్రిక్స్ అనే పేరు వచ్చింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా. ఆ తర్వాత ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, సౌదీ అరేబియాలను బ్రిక్స్ జాబితాలో చేరాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఈవీఎంలా..? బ్యాలెట్టా..? చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో...

దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు..!

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి...

జగన్‌కు షాక్.. వైసీపీలో...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస...

మాకు ఈ పదవులు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర...

గ్లాస్ స్కై వాక్...

ఏదైనా మంచి జరిగితే.. అది మా...

రేవంత్ గోప్యతకు కారణం...

రాజకీయాల్లో తెలంగాణ కాంగ్రెస్ కాస్త డిఫరెంట్...

పోల్స్