Wednesday, April 1, 2026 06:42 PM
Wednesday, April 1, 2026 06:42 PM

ఈసారి మావిగన్ అంటున్న జగన్

ఎవరికైనా చూపించండి రా.. అలా వదిలేయకండి రా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రావు రమేశ్ చెప్పిన ఈ డైలాగ్ బాగా ఫేమస్. ఇంకా చెప్పాలంటే.. మీమర్స్‌ బాగా వాడేస్తున్నారు. ఇప్పుడు ఇదే డైలాగ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోయింది. నిజానికి ఇదే డైలాగ్‌ను చాలా సందర్భాల్లో జగన్‌కు వాడేశారు. కానీ ఇప్పుడు మాత్రం.. సరిగ్గా సరిపోయింది. జగన్ అంటే లండన్ మందులు వాడతారని బయట బాగా టాక్. ఆ మందులు అయిపోయినట్లున్నాయి.. అనేలా తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో జగన్ వ్యాఖ్యలున్నాయి. ఇంకా చెప్పాలంటే.. జగన్ మీడియా ముందుకు వస్తున్నాడంటే చాలు.. మీమర్స్‌ రెడీగా ఉంటున్నారు.

Also Read : హోటల్ ఫుడ్ ఇక భారమే.. ఆయిల్ కంపెనీలు సంచలన నిర్ణయం..!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్‌మీట్ అంటే చాలు.. అది ఒక కామెడీ షో అయిపోయింది. నిజానికి మాజీ ముఖ్యమంత్రి, లేదా మంత్రులు మీడియా ముందుకు వస్తున్నారంటే.. అధికార పార్టీలో చిన్న పాటి కలవరం మొదలవుతుంది. తాము ఏమైనా తప్పు చేశామేమో.. ఆ తప్పులను రుజువులతో సహా బయటపెడతారేమో అని భయపడతారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఇలాగే చేశారు. కానీ జగన్ విషయంలో మాత్రం అలా జరగదు. వైసీపీ నేతలు మీడియా ముందుకు వస్తున్నారంటే.. టీడీపీ నేతలు ఇంకొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. జనాలకు అడ్డంగ బుక్ అయ్యేందుకు వస్తున్నారని సంబరపడిపోతారు కూడా.

తాజాగా అమరావతికి రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ అసెంబ్లీ తీర్మానంపై జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. అసలు రాష్ట్ర రాజధాని అనే మాట రాజ్యాంగంలో లేదని మరోసారి పాత పాటే పాడారు. మరి అలా అయితే.. స్టేట్ క్యాపిటల్ అనే మాట ఎందుకు అంటున్నారు అనేది ఇప్పుడు ఏపీ ప్రజల మాట. పక్క రాష్ట్రాలకు క్యాపిటల్ ఉండొచ్చు.. కానీ ఏపీ వరకు వస్తే మాత్రం.. ఆ మాటే రాజ్యాంగంలో లేదు అంటున్నారు జగన్. ఆ తర్వాత అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదన్నారు.. ఆ మాటకు వస్తే.. ఏ ప్రాంతానికి వైసీపీ వ్యతిరేకం కాదన్నారు. మరి అలా అయితే.. అమరావతిని స్మశానం అని, ముంపు ప్రాంతమని, అలల రాజధాని అని వైసీపీ నేతలు విమర్శలు చేసినప్పుడు.. జగన్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. ఇది ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు కాదా.. అనేది సూటి ప్రశ్న.

ఇక శాసనసభలో చర్చ పెట్టారు.. మరి మండలిలో ఎందుకు పెట్టలేదు.. అని ప్రశ్నించారు జగన్. మండలిలో మా వాళ్లు నిలదీస్తారని చంద్రబాబుకు భయం.. అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ నిలదీసేది ఏదో.. మరి అసెంబ్లీలో చర్చకు హాజరై ప్రభుత్వాన్ని జగన్ సహా వైసీపీకి చెందిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు నిలదీయలేదు.. అనేది ఏపీ ప్రజల ప్రశ్న. అసలు మండలి వద్దు అన్న జగన్.. ఇప్పుడు మండలిలో చర్చ అని డిమాండ్ చేయడం ఏమిటో.. అని చర్చించుకుంటున్నారు. అసెంబ్లీలో నన్ను తిట్టడం తప్ప చర్చ జరగలేదు అన్నారు జగన్. మరి గతంలో 3 రాజధానులంటూ అసెంబ్లీలో జరిగిన చర్చ సమయంలో.. చంద్రబాబును తిట్టడంతో పాటు అమరావతి ప్రాంతాన్ని కేవలం ఒక కులానికి చెందిన ప్రాంతం అని వ్యాఖ్యలు చేసిన సందర్భం జగన్ మర్చిపోయారా.. అనేది సూటి ప్రశ్న.

Also Read : నేటి నుంచి అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. కీలక మార్పులు ఇవే..!

ఇక రాజధానిగా అమరావతి ప్రాంతం ఎంపికపై జగన్ మరోసారి విషం చిమ్మారు. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం ఓ పిచ్చి పని అని అభివర్ణించారు. అదే సమయంలో విచిత్రమైన ప్రతిపాదన చేసి అందరిలో నవ్వుల పాలవుతున్నారు జగన్. మచిలీపట్నం నుంచి MA, విజయవాడ నుంచి VI, గుంటూరు నుంచి GUN అనే అక్షరాలు తీసుకుని.. ఈ మూడు ప్రాంతాలు కలిసేలా #MAVIGUN అని పేరు పెట్టాలని.. అదే రాజధాని అని ప్రకటించాలన్నారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వైరల్‌గా మారాయి. మచిలీపట్నం, జగ్గయ్యపేట, గుంటూరు కలిసి #MAJAGUN అని పెడితే నీ పేరు కూడా వస్తుంది కదా.. సెటైర్లు వేస్తున్నారు. నీకు ఈ పేర్ల పిచ్చి ఏమిటి స్వామి.. అని మీమర్స్ ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే.. అన్న లండన్ వెళ్లే సమయం ఆసన్నమైంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి జగన్ ప్రెస్ మీట్ అంటే చాలు.. మీమర్స్‌కు పండగే పండుగ.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఎమ్మెల్యేలు సీరియల్స్ చూడటం...

కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేల తీరుపై...

బ్రేకింగ్: మారిన మాట.....

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో...

నవ్యాంధ్ర చరిత్రలో కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తుకు సంబంధించి...

దుమారం రేపుతున్న కాగ్...

కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై కంప్ట్రోలర్...

మెగా ఫ్యాన్స్ కు...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

ధర్నా వ్యవహారంపై సిఎం...

అమరావతిలో ఇటీవల గ్రామీణ నీటి సరఫరా...

పోల్స్