Friday, September 12, 2025 05:16 PM
Friday, September 12, 2025 05:16 PM
roots

వాళ్ళను యాక్టీవ్ చేసిన జగన్.. కూటమి కంట్రోల్ చేస్తుందా..?

2019లో టిడిపి ఓటమి తర్వాత వైసిపి ఆ పార్టీ కార్యకర్తలను అనేక రకాలుగా వేధించింది. పార్టీ నాయకులను కార్యకర్తలను పలు నియోజకవర్గంలో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా.. ఎన్నో విధాలుగా దెబ్బ కొట్టారు వైసీపీ నాయకులు. ఇక మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భాలు లెక్కే లేవు. వైసిపి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ నాయకులు చిన్నచిన్న వ్యాపారాలను కూడా వేధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏకంగా మంత్రులే వసూళ్లకు పాల్పడిన సంఘటనలు కూడా చూసాం. ఇక ఎమ్మెల్యేలు అలాగే పార్టీలో ఉన్న నాయకులు మీడియా ముందుకు వస్తే బూతులు మినహా మరో మాట మాట్లాడే వారు కాదు.

Also Read : HCU భూముల్లో కీలక పరిణామం, రేవంత్ కు షాక్ తప్పదా..?

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు సంస్థాగతంగాచేసిన విమర్శలు చాలా అరుదు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది.. కూటమి అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ నేతలు మౌనంగా ఉంటారని చాలామంది భావించారు. అయితే ఆ పార్టీ నేతలు మార్పు పెద్దగా కనబడడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏ విధంగా అయితే విమర్శలు చేశారో ఇప్పుడు కూడా అదే తరహాలో కొంతమంది నాయకులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కీలక నాయకులపై కేసులు నమోదవుతున్న సరే కొంతమంది మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

Also Read : వైసీపీకి జీవం పోస్తున్న టీడీపీ నేతలు.. ఇలా అయితే ఎలా..?

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మంత్రి నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు గోరంట్ల. ఇక మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఇదే తరహాలో మాట్లాడుతున్నారు. అప్పట్లో వైలెంట్ గా మాట్లాడిన వైసీపీ నాయకులు.. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Also Read : అమిత్ షాకు లావు సంచలన లేఖ

అయితే వీరందరి వ్యవహార శైలి కూడా టిడిపిని అలాగే ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడమే అనే అభిప్రాయాలు బలంగా వినబడుతున్నాయి. జగన్ రాప్తాడు పర్యటన తర్వాత వైసిపి నాయకుల మాట తీరులో చాలా మార్పు కనపడుతోంది. ఇక పార్టీలో కూడా వివాదాస్పదంగా మాట్లాడే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో అలజడి వాతావరణ సృష్టించేందుకు వైసిపి ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇక ఇప్పుడు మళ్లీ మాట్లాడుతున్న నాయకుల అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నా సరే వారిపై చర్యలు తీసుకోవడం లేదు. గోరంట్ల మాధవ్ చేసిన కార్యక్రమాలకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయి. అలాగే కారుమూరి నాగేశ్వరరావు రెవిన్యూ శాఖలో పలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు సైతం ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా రాష్ట్రంలో ప్రభుత్వం సేకరించింది. అయినా సరే వీరిపై చర్యలు మాత్రం ఇప్పటివరకు తీసుకోలేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్