Tuesday, October 28, 2025 08:12 AM
Tuesday, October 28, 2025 08:12 AM
roots

బ్రేకింగ్: మైత్రీకి మూడింది.. భారీ ఫైన్ పడే ఛాన్స్

పుష్ప సినిమా నిర్మాతల లాభాలపై ఐటి అధికారులు ఫోకస్ పెట్టారు. రెండు రోజుల నుంచి సినిమా వాళ్ళను టార్గెట్ చేసుకుని హైదరాబాదులో ఐటి అధికారులు దాడులు చేస్తుండగా… మంగళవారం రోజున టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో పెద్ద ఎత్తున సోదాలు జరిగాయి. విమానాశ్రయంలో ఉన్న డైరెక్టర్ సుకుమార్ ను ఉన్నపళంగా ఆయన ఇంటికి తీసుకెళ్ళిన ఐటీ అధికారులు అక్కడ సోదాలు నిర్వహించారు. పుష్ప సినిమాకు సంబంధించి సుకుమార్ తీసుకున్న రెమ్యునరేషన్ సహ ఆయన ఆదాయవనరులపై ఐటీ అధికారులు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.

Also Read : ఏబీవీపై కేసు పెట్టాలంటున్న సాక్షీ.. మరి విజయసాయి రెడ్డిని ఏం చేయాలి…?

ఆయన రెమ్యూనరేషన్ కు సంబంధించి ఐటీ చెల్లింపులు చేశాడా లేదా అనేదానిపై కూడా ఆరా తీసారు. గత ఏడాది డిసంబర్ నాలుగున రిలీజ్ అయిన పుష్ప సినిమా భారీగా విజయం సాధించింది. 1850 కోట్ల వరకు కలెక్షన్లు వసూలు చేసింది. అయితే ఆ లెక్కలు నిజమా కాదా అని తేల్చి పనిలో పడ్డ ఐటీ అధికారులు కీలక విషయాలపై ఆధారాలు సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ కు ఐటి అధికారులు 150 కోట్లకు పైగా ఫైన్ వేసి అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

పుష్ప సినిమాకి సంబంధించి జరిగిన బిజినెస్ లో 500 కోట్లకు పైగా తారుమారు అయినట్లు లెక్కలు తేల్చారు. సుకుమార్ ను ఉదయం నుంచి ప్రశ్నిస్తున్న ఐటీ అధికారులు.. ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ కు సంబంధించి ఆదాయపు పన్ను కట్టలేదు అని తేల్చారు. సుకుమార్ 100 కోట్ల వరకు తీసుకోగా అల్లు అర్జున్ 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి.

Also Read : అమరావతిలో చేపల చెరువులు, జగన్ మరో ఘనత…!

ఇక ఏడాది లెక్కన డైరెక్టర్, హీరోలకు మైత్రి మూవీ మేకర్స్ రెమ్యూనరేషన్ చెల్లించింది. పుష్ప సినిమా నిర్మాణం లో సుకుమార్ కూడా పార్టనర్ గా ఉండటంతో కలెక్షన్స్ లో ఆయనకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తేల్చారు. అయితే సుకుమార్ రెమ్యూనరేషన్ పై అలాగే ఆయనకు వచ్చిన లాభాల్లో వాటాలపై మాత్రం లెక్కలకు సరైన పత్రాలు లేకపోవడంతో సుకుమార్ కు కూడా భారీగా ఫైన్ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్