సాధారణంగా ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీలు సీరియస్ గా తీసుకుంటాయి. ఆ విజయాలతో పెద్దగా అధికార పార్టీలకు ఉపయోగం లేకపోయినా.. తమ ప్రభుత్వానికి ప్రజల్లో మద్దతు ఉంది అని విపక్షాలను టార్గెట్ చేసేందుకు ఈ ఉప ఎన్నికలను అధికార పార్టీలు వాడుకుంటాయి. అలాంటి ఉప ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలకు శాపంగా మారుతున్నాయి. 2017 నుంచి ప్రస్తుతం జరిగిన జిల్లా పరిషత్ ఎన్నిక వరకు చూసుకుంటే అధికార పార్టీలకు ఈ ఎన్నికలు పెద్దగా కలిసి రాలేదు.
Also Read : జగన్.. ఇదేం లాజిక్..?
2017 లో నంద్యాల ఉప ఎన్నికను అప్పటి టిడిపి ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి పెట్టి కొట్టింది. కానీ 2029 ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది. ఇక వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి ఉప ఎన్నికను మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సీరియస్ గా తీసుకుని నిర్వహించారు. అలాగే కుప్పం మున్సిపాలిటీ ఎందుకు విషయంలో కూడా జగన్ చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారు. కానీ 2024 ఎన్నికల్లో అత్యంత దారుణంగా వైసీపీ ఓడిపోయింది. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
Also Read : పవన్ సినిమా హీరో కాదు మినిస్టర్.. ప్రమోషన్లో ఫెయిల్ అవుతోన్న జనసేన
ఇప్పుడు జిల్లా పరిషత్ ఉపఎన్నిక విషయంలో టిడిపి సర్కార్ చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. 30 ఏళ్ల తర్వాత ఎన్నిక జరగటంతో పోలీసులు కూడా అత్యంత పగడ్బందీగా వ్యవహరించారు. కానీ ఈ ఎన్నిక టిడిపికి సెంటిమెంట్ ప్రకారం మైనస్ అయ్యే అవకాశం ఉందంటూ టిడిపి కార్యకర్తల్లో ఒకరకంగా ఆందోళన నెలకొంది. 2029 ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు సైతం వినపడుతున్నాయి. ఇక జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ కూడా ఒకరకంగా ఆందోళన లోనే ఉంది. సీఎం సొంత నియోజకవర్గంలో అంత భారీ తేడాతో ఓడిపోవడం అనేది ఒకరకంగా వైసిపికి అవమానం అనే చెప్పాలి.