సిగరెట్ విషయంలో చాలా వరకు ఆందోళన వ్యక్తమవుతోంది. చాలా మంది సిగరెట్ మానుకోలేక ఇబ్బందులు పడటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో.. నికోటిన్ ఉత్పత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సిగరెట్ మానుకోవాలి అనుకునే వారు.. నికోటిన్ గమ్ లు వాడుతూ ఉంటారు. అయితే ఇది మాత్రం వైద్యుల సలహా మేరకే వాడాల్సి ఉంటుంది. 4 ఎంజీ వరకు నికోటిన్ గమ్ లు వాడుకోవచ్చని నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా 2 ఎంజీ, 4 ఎంజీ గమ్ లు అందుబాటులో ఉన్నాయి.
Also read :పెళ్లిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
3 దశాబ్దాలకు పైగా వీటిని ఎక్కువగా వాడుతున్నారు. వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించింది కూడా. అలాగే ముఖ్యమైన ఔషధాల జాబితాలో చేర్చింది. ఒకటిన్నర సంవత్సరాల క్రితం వరకు, మన దేశంలో షెడ్యూల్ కే ఔషధాల కింద 4 ఎంజీ వరకు నికోటిన్ గమ్స్ ఓవర్ ది కౌంటర్ అమ్ముడయ్యాయి. నికోటిన్ పౌచ్‌లు లేదా కొత్త డెలివరీ ఫార్మాట్‌ల మాదిరిగా కాకుండా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 కింద వీటిని నియంత్రిస్తారు. ధూమపానం చేసేవారు.. పొగాకును విడిచిపెట్టడంలో వీటి సహాయం ఎంతగానో ఉంటుంది.
Also read : మోడీ కేబినేట్ లో వింతలు ఇవే..!
ద్వారకలోని మాక్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ మదన్ మాట్లాడుతూ.. నికోటిన్ ప్రమాదరహితమైనది కాదని హెచ్చరించారు. కానీ ఔషధ నికోటిన్.. ధూమపానం కంటే కాస్త తక్కువ ప్రమాదకరం. దేశంలో 100 మిలియన్లకు పైగా ధూమపానం చేస్తున్నారు. 2022 లెక్కల ప్రకారం.. అది. వారిలో చాలా మంది ధూమపానం వదిలేయాలి అనుకున్నారని కేంద్రం గుర్తించింది. కానీ ఔషధాలు లేకుండా అది సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

