ఈ రోజుల్లో పురుగుల మందులు లేకుండా ఏ కూరగాయాలు పండించడం లేదు అనే మాట వాస్తవం. అవి తాజాగా ఉంచడానికి కూడా ఏదోక మందులు వాడే పరిస్థితి నెలకొంది. మరి వాటిని పురుగు మందులు లేకుండా ఎలా శుభ్రం చేయాలో ఒకసారి చూస్తే.. పండ్లు, కూరగాయలు పొలాల్లో, రవాణా సమయంలో దుమ్ము, సూక్ష్మజీవులతో పాటు ఉపరితల పురుగుమందుల అవశేషాలను కలిగి ఉంటాయి. ఇంట్లో ప్రతీ ఒక్కటి గుర్తించకపోయినా.. మనం సరిగా శుభ్రం చేస్తే మాత్రం వాటిని తొలగించే అవకాశం ఉంటుంది.
Also Read : ఏపీ తెలుగు మహిళగా స్వామి శిష్యులు..!
ఇక వాటిని శుభ్రం చేయడానికి సులభమైన, అత్యంత అందుబాటులో ఉన్న మార్గాలలో ఒకటి ఉప్పు నీరు. సరిగ్గా ఉపయోగిస్తే వాటి రూపం, లేదా రుచి ప్రభావితం కాకుండా.. మురికి వదిలించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, ఆకు కూరలను ఉప్పుతో కడగడం చాలా వరకు మేలు చేస్తుంది. ఒక పెద్ద గిన్నెలో శుభ్రమైన నీటిని నింపి, లీటరు నీటికి 1-2 టీస్పూన్ల సాధారణ టేబుల్ సాల్ట్ జోడించాల్సి ఉంటుంది. ఉప్పు పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలపాల్సి ఉంటుంది. నీళ్ళు తేలికపాటి ఉప్పగా ఉండటం మంచిది.
Also Read : ఇండియన్స్ కు ట్రంప్ బిగ్ షాక్..?
నానబెట్టే ముందు వాటిని మంచి నీళ్ళతో కడిగితే బురద వంటివి పోయే అవకాశం ఉంటుంది. కూరగాయలను పూర్తిగా ఉప్పు ద్రావణంలో ముంచి, వాటిని దాదాపు 10–15 నిమిషాలు నానబెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూరగాయాలను ఉప్పు నీళ్ళలో నుంచి తీసేయాలి. దీనితో కూరగాయాలపై ఉన్న పురుగుల అవశేషాలు, పురుగు మందులు వంటివి పోయే అవకాశం ఉంటుంది. ఉప్పు నీళ్ళతో కడిగిన తర్వాత, మళ్ళీ మంచి నీళ్ళతో కడగాల్సి ఉంటుంది. అలా చేయకపోతే అనవసర సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

