సినిమా పైరసీ వీరుడు, ఐబొమ్మ వెబ్ సైట్ తో సినిమా పరిశ్రమను వణికించిన ఇమ్మడి రవిని పోలీసులు విచారిస్తున్నారు. కోర్ట్ కస్టడీకి అనుమతి ఇవ్వడంతో, అతను చేసిన కార్యాకలాపాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండవ రోజు కస్టడీలో అతని విచారణ కొనసాగుతోంది. ఐబొమ్మ రవిపై మరో మూడు సెక్షన్ లు నమోదు చేసారు పోలీసులు. ఇప్పటికే రవిపై 10 సెక్షన్లు పెట్టిన పోలీసులు.. తాజాగా మరో సెక్షన్ లో కేసు నమోదు చేసారు. ఐటీ యాక్ట్, బీఎన్ఎస్ సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, విదేశీ యాక్ట్ కింద 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.
Also Read : సిఎం మార్పు ఖాయమే..? వదలని డిప్యూటి సిఎం..!
తాజాగా ఫోర్జరీ సెక్షన్ ను జోడించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరుపై పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ.. అతను తీసుకున్నట్టు గుర్తించారు. ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ చేసారు. ఎస్బీఐ ఇన్స్యూరెన్స్ పోర్టల్ లో ఐబొమ్మ లింక్ ప్రత్యక్షమవడంతో.. ఎస్బీఐ టీం ను సైబర్ క్రైమ్ పోలీసులు పిలిచారు. ఎస్బిఐ టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పోర్టల్ కు ఐబొమ్మ లింక్ రావడంతో.. బ్యాంకు టీం నుంచి పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇక తొలి రోజు అతని విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి.
Also Read : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు..!
తాను ఒంటరివాడినని.. మీరేమైనా చేస్కోండని చెప్పిన రవి.. పోలీసు విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తున్నట్టు సమాచారం. ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ గురించి కస్టడీలో పూర్తిగా రవి వివరించాడు. కొత్త సినిమాలను అప్పుడే ఎక్కడ రికార్డింగ్ చేస్తారు?.. రికార్డింగ్ చేసిన సినిమాలను ఐబొమ్మ వెబ్‌సైట్ లో ఎలా అప్‌లోడ్ చేస్తారని పోలీసుల ఆరా తీసారు. ఏజెంట్లకు కొంత డబ్బు చెల్లించి కొత్త సినిమాలు రికార్డింగ్ చేస్తామని రవి తెలిపినట్టు సమాచారం. టెక్నికల్ సమస్య వస్తే ఎలా అధిగమిస్తారని పోలీసులు ప్రశ్నించారు. ఇక టెక్నికల్ టీం ను సైతం రంగంలోకి దింపినట్టు సమాచారం. ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వహణకు పలు ఐపీ అడ్రస్ లు మార్చినట్లు గుర్తించారు.

